Bhola Shankar: ఎందుకిందంతా? కంటెంట్ పై నమ్మకం లేదా?

టాలీవుడ్ లో ఈ సంవత్సరం రిలీజ్ అవుతున్న పెద్ద సినిమాల్లో ఒకటి “భోళా శంకర్”. పేరుకి పెద్ద సినిమా అయినా కూడా ఈ సినిమాకి మెగాస్టార్ చిరంజీవి మినహా పెద్దగా ప్లస్ పాయింట్స్ లేవు. ఎందుకంటే ఎప్పుడో 7ఏళ్ళ కిందటొచ్చిన తమిళ్ సినిమా వేదాళం కి రీమేక్ గా తెరకెక్కుతుంది. అసలే రీమేక్ సినిమా అంటే, ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నది పదేళ్లుగా సినిమా తీయని మెహర్ రమేష్ కావడం ఒక ఎత్తు. పైగా బిల్లా తర్వాత వచ్చిన సినిమాలన్నీ ఏ రేంజ్ లో డిజాస్టర్స్ అయ్యాయని తెలిసిందే.

అయితే షూటింగ్ జరుపుకుంటున్నా మెగా ఫ్యాన్స్ సైతం భోళా శంకర్ ని పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఎప్పుడైతే ఈ సినిమా టీజర్ వచ్చిందో అప్పట్నుంచి పాజిటివ్ వైబ్స్ స్టార్ట్ అయ్యాయి. టీజర్ చూస్తే కొంచెం రొటీన్ గానే ఉన్నా, అందులో మెగాస్టార్ లుక్స్, డైలాగ్స్ బాగుండడంతో ఫ్యాన్స్ అట్రాక్ట్ అయ్యారు. ఇక ఈ సినిమా నుండి రీసెంట్ గా వచ్చిన పాటలు కూడా బాగున్నాయి. దాంతో భోళా శంకర్ పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి.

అయితే తాజాగా మెగాస్టార్ చిరంజీవి చిరు లీక్స్ లో భాగంగా రిలీజ్ చేసిన వీడియో లో పవర్ స్టార్ మ్యానరిజం తో ఒక వీడియో బిట్ రిలీజ్ చేసారు. చూడ్డానికి చాలా బాగుంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి బాగా నచ్చుతుంది. కానీ ఈ వీడియో రిలీజ్ చేయడం వల్ల సినిమాపై ఒక రకమైన డౌట్ కూడా మొదలైంది. ఎందుకంటే ఈ సినిమాపై ఇప్పటివరకు మెగాస్టార్ ఉన్నాడన్న బలంతో పాటు, టీజర్, పాటలు బాగున్నాయన్న ఇంప్రెషన్ ఉండేది. కానీ ఇప్పుడు రిలీజ్ చేసిన వీడియో బిట్ హైప్ పెంచడానికే అని అర్ధం అవుతుంది.

- Advertisement -

మరి ఈ సినిమాలో ఇలాంటి సీన్లు పెట్టడానికి కారణం ఫ్యాన్స్ ని ఖుషి చేయడానికేనా? లేకపోతే సినిమాలో స్క్రీన్ ప్లే బాగా లేదా? అన్న అనుమానం వస్తుంది. లేకపోతే కంటెంట్ పై నమ్మకం లేదా అని అనిపిస్తుంది. అయితే చిరు ఇమిటేట్ చేసి అలరించినా, మెగా స్టార్ రేంజ్ కి ఇది తగినది కాదని ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇదే కాదు మొన్న వచ్చిన సాంగ్ లో ఆ జానపద పాట స్పూఫ్ పై కూడా డాన్స్ చేయడం బాగాలేదని అంటున్నారు.

మరి ఇవన్నీ సినిమాపై హైప్ పెంచడానికా? ఇంకా దేనికో అర్ధం కాక నెటిజన్లు తమ పాయింట్ అఫ్ వ్యూ లో రకరకాలుగా చర్చించుకుంటున్నారు. ఏది ఏమైనా భోళా శంకర్ పై ఇప్పుడు ఉన్న హైప్ సరిపోదనే చెప్పాలి. ఈ సినిమాపై అంచనాలు పెరగాలంటే సరికొత్తగా ప్రమోట్ చేయాలి. మరి రిలీజ్ టైమ్ వచ్చేసరికి చిత్ర యూనిట్ ఎలా హైప్ పెంచుతుందో చూడాలి.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు