Prabhas: రిలీజ్ కు ముందే రికార్డ్స్ క్రియేట్ చేస్తున్న సలార్

ఈ మధ్య ప్రభాస్ సినిమా వస్తుందంటే చాలు ఏ కొత్త రికార్డ్ క్రియేట్ చేయబోతుందా అని ఎదురు చూసే రోజులు వచ్చాయి. బాహుబలి సినిమాతో మొదలైన ప్రభాస్ సినిమాల రికార్డ్స్ పరంపర ఆయన ప్రతి సినిమాకు కొనసాగుతూనే ఉంది.

హిట్, ఫ్లాప్ అనే తేడా లేకుండా ఇప్పటి వరకు రిలీజైన ప్రతి సినిమా ఎదో ఒక రికార్డ్ క్రియేట్ చేస్తూ ప్రేక్షకులను ఆశ్చర్య పరుస్తుంది. ఇక ఆయన హీరోగా వస్తోన్న లేటెస్ట్ సినిమా సలార్ ఐతే ఏకంగా రిలీజ్ కు ముందే వండర్స్ క్రియేట్ చేస్తుంది.

ప్రభాస్ హీరోగా, కెజిఎఫ్ ఫేం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తోన్న సలార్ పార్ట్ 1 టీజర్ ఇటీవలనే రిలీజైన విషయం తెలిసిందే. ఇండియాలోనే మోస్ట్ యాన్టిస్పెటెడ్ సినిమా నిర్మితమవుతున్న ఈ సినిమా టీజర్ రిలీజైన కొద్దీ గంటల్లోనే 100మిలియన్లలకు పైగా వ్యూస్ ను సాధించి రికార్డ్ క్రియేట్ చేసింది.

- Advertisement -

సక్సెస్ ఫుల్ చిత్రాల నిర్మాణ సంస్థ హోంబలె ఫిలిమ్స్ ప్రొడక్షన్ నుంచి రాబోతున్న ఈ సినిమాలో ప్రభాస్ జోడిగా శృతి హాసన్ నటిస్తుంది. మలయాళం స్టార్ట్ యాక్టర్ పృథ్వి రాజ్ సుకుమారన్, జగపతి బాబు ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు.

దాదాపు చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా వచ్చే సెప్టెంబర్ 28 న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అవబోతుంది. ఇక ఇటీవలనే సలార్ సినిమాను అమెరికాలో రిలీజ్ చేయడానికి గాను డిస్టిబ్యూషన్ రైట్స్ ను ప్రత్యంగిర సినిమాస్ కొనుగోలు చేసింది.

అయితే ఈ సంస్థ సలార్ సినిమాను నార్త్ అమెరికాలో దాదాపు 1979 థియేటర్స్ లో విడుదల చేయడానికి ప్లాన్ చేసింది. ఇండియా కంటే ఒకరోజు ముందుగానే నార్త్ అమెరికాలో ప్రీమియర్ షోస్ వేయనున్నారు. అయితే ఇదివరకెప్పుడు కూడా ఇంత భారీ స్థాయిలో ఏ ఇండియన్ సినిమా అమెరికాలో రిలీజ్ అవలేదు. కేవలం ఈ అదృష్టం ప్రభాస్ ఒక్కడికే దక్కింది. ఈ విషయాన్ని ప్రత్యంగిర సినిమాస్ ఇటీవలనే వెల్లడించగా ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు