Harish Shankar : మొత్తానికి సినిమా సెట్

హరీష్ శంకర్, ఇతర భాషల్లో వచ్చే సినిమాలను తనదైన శైలిలో మార్పులు జరిపి హిట్ కొట్టే దర్శకుడు. “షాక్” “మిరిపకాయ్” లాంటి సినిమాల తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఛాన్స్ కొట్టాశాడు. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ “దబాంగ్” ను తెలుగులో “గబ్బర్ సింగ్” అనే పేరుతో రీమేక్ చేశాడు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ హీరో.

అప్పటి నుండి పవర్ స్టార్, మెగా ఫ్యామిలీ అభిమానిగా ఉండిపోయాడు. అందుకే శంకర్ చేసిన ఏడు సినిమాల్లో నాలుగు సినిమాలు మెగా హీరోలవే. “గద్దలకొండ గణేష్” తర్వాత పవన్ కళ్యాణ్ తో రెండో సినిమా చేయాలనుకున్నాడు శంకర్. అందు కోసం “భవదీయుడు భగత్ సింగ్” స్టోరీని కూడా రెడీ చేశాడు.

ఈ స్టోరీని పవన్ కు వినిపించి దాదాపు మూడేళ్లు అవుతుంది. కానీ, ఇప్పటి వరకు సెట్ కాలేదు. ఇప్పట్లో షూటింగ్ స్టార్ట్ అవుతుందని కూడా చెప్పలేం. పవన్ రాజకీయా యాత్ర చేయాలని నిర్ణయం తీసుకోవడంతో, శంకర్ ఓ మిడ్ రేంజ్ హీరోతో సినిమా చేయాలని భావించినట్టు వార్తలు వచ్చాయి.

- Advertisement -

అంతే కాదు, హరీష్ శంకర్ తన తర్వాత సినిమా కోసం ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేనిని సంప్రదించారట. అంతే కాకుండా ఓ స్టోరీని కూడా వినిపించాడని తెలుస్తుంది. స్టోరీ నచ్చడంతో రామ్ పోతినేని గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు టాక్. దీనిపై అతి త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే ఛాన్స్ ఉంది అంటూ వార్తలు వినిపించాయి.

తాజాగా రామ్ పోతినేని “ది వారియర్” ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హరీష్ శంకర్ మాట్లాడాడు. రామ్ ఎనర్జీ తనకు నచ్చుతుందని, త్వరలోనే రామ్ తో సినిమా చేస్తాను అంటూ చెప్పుకొచ్చాడు. అయితే, అది ఎప్పుడు ఉంటుందో ఈ రోజు చెప్పలేను కానీ, ఖచ్చితంగా ఉంటుందని చెప్పాడు.

దీంతో హరీష్ శంకర్ తర్వాత సినిమా రామ్ పోతినేనితోనే అని దాదాపు ఫిక్స్ అయిపోయిందని సమాచారం. అందుకే హరీష్ శంకర్ ఈ వ్యాఖ్యలు చేశారని తెలుస్తుంది. ఈ కాంబో గురించి అతి త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు