Pawan : రావడం మాత్రం పక్కా

తెలుగు చిత్ర సీమలో మాస్ ఫాలోయింగ్ ఉన్న హీరోల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముందు వరుసలో ఉంటాడు. సినిమా రంగంలో ఉన్నా, రాజకీయ రంగంలో ఉన్న పవన్ కు ఉన్న క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. పవర్ స్టార్ నుంచి సినిమాలు వస్తే.. ప్లాప్ టాక్ వచ్చినా రికార్డు స్థాయిలో కలెక్షన్లు వస్తాయి. అది కేవలం పవర్ స్టార్ అభిమానుల వల్లే సాధ్యమవుతుంది. రీ ఎంట్రీ తర్వాత కూడా ఈ గబ్బర్ సింగ్ హవా తగ్గలేదు. వకీల్ సాబ్, భీమ్లా నాయక్ తో ఫ్యాన్స్ ఫుల్ కిక్ లో ఉన్నారు.

అయితే కొన్ని రోజుల నుంచి పవన్ ఫ్యాన్స్ గందరగోళంలో ఉన్నారు. వరుసగా సినిమాలను లైన్ లో పెట్టినా.. ఇప్పటి వరకు ఒక్క సినిమా కూడా విడుదల కాలేదు. నిజానికి షూటింగ్ లు కూడా పూర్తి కాలేదు. హరి హర వీరమల్లు ఇంకా షూటింగ్ స్టేజ్ లో ఉంది. భవదీయుడు భగత్ సింగ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇదిలా ఉండగా, పవన్ పుట్టిన రోజు సందర్భంగా తమ్ముడు, జల్సా సినిమాలు రీ రిలీజ్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాల్లో పవన్ స్టైల్, డ్యాన్స్ ఒక రేంజ్ లో ఉంటుంది. మళ్లీ అలాంటి పవన్ కళ్యాణ్ చూడాలని ఫ్యాన్స్ తెగ మూచ్చట పడతున్నారు.

ఇదే విషయాన్ని ఒక అభిమాని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. “ఆ స్టెప్పులు ఆఆ స్టైల్ ఆ స్వాగు ఏమైపోయావ్ కళ్యాణ్ అన్న.. హరీష్ శంకర్ అన్న మల్లి నీ వల్లే అవుతాది ఇలాంటివి.. ని సినిమా తో లాస్ట్ అనిపిస్తుంది” అని రాసుకొచ్చాడు. దీనికి డైరెక్టర్ హరీష్ శంకర్ స్పందించాడు. “అన్నీ ఉంటాయి… ఏదీ మిస్ అవ్వదు.. దీని కోసం మీరు వేచి చూసినదానికి ప్రతి ఫలం తప్పక ఉంటుంది” అంటూ హరీష్ శంకర్ సమాధానం ఇచ్చాడు.

- Advertisement -

అయితే పవన్ రాజకీయ యాత్ర వల్ల భవదీయుడు భగత్ సింగ్ ను దూరం పెట్టాడని, ఈ సినిమా రావడం లేదు అంటూ కొన్ని రోజుల నుంచి తెగ ప్రచారం సాగింది. అలాగే ఈ సినిమా స్టోరీ పవన్ కు నచ్చలేదని అందుకే దీన్ని పక్కన పెట్టి తర్వాత సైన్ చేసిన వినోదయ సీతం రీమేక్ కు డేట్స్ ఇచ్చాడని కూడా వార్తలు వచ్చాయి. మొత్తంగా భవదీయుడు భగత్ సింగ్ రావడం లేదని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. దీనిపై హరీష్ శంకర్ గానీ, పవన్ టీం గానీ స్పందించక పోవడంతో నిజమే అనుకున్నారు. కానీ, ఈ రోజు హరీష్ శంకర్ చేసిన ట్వీట్ తో అన్ని ప్రశ్నలకు సమాధానం వచ్చింది. భవదీయుడు భగత్ సింగ్ రావడం లేట్ అవ్వచ్చేమో కానీ రావడం మాత్రం పక్కా అని తేలిపోయింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు