Liger : రెమ్యునరేషన్ ఎంతంటే?

పూరీ జగన్నాధ్, విజయ్ దేవరకొండ కాంబోలో వచ్చిన తాజా చిత్రం లైగర్. భారీ అంచనాల నడుమ గురువారం ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ అశించిన స్థాయిలో టాక్ మాత్రం రాలేదు. పూరీ అభిమానులను, రౌడీ హీరో ఫ్యాన్స్ ను తీవ్రంగా నిరాశ పరిచింది. రూ. 180 కోట్ల బడ్జెట్ తో కరణ్ జోహర్, పూరీ జగన్నాధ్, ఛార్మీ కౌర్ ఈ చిత్రాన్ని నిర్మించిన సంగతి తెలిసిందే. భారీగా లాభాలు వస్తాయని భావించిన ఈ నిర్మాతలకు చివరికి నష్టాలే వచ్చేట్లు ఉంది.

ఇది ఇలా ఉండగా, ప్రస్తుతం లైగర్ చిత్రలో నటించిన నటీ నటుల రెమ్యునేషన్ వివరాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ రెమ్యునరేషన్ ప్రస్తుతం టాలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. దీని ప్రకారం.. ఈ చిత్రలో అత్యధిక పారితోషికం తీసుకున్న వారిలో హీరో విజయ్ దేవరకొండ కంటే ముందు అంతర్జాతీయ బాక్సర్ మైక్ టైసన్ ఉన్నారు. ఈ చిత్రానికి రూ. 40 కోట్ల పారితోషికాన్ని మైక్ తీసుకున్నారట. అలాగే హీరో విజయ్ 35 కోట్లు, హీరోయిన్ అనన్య పాండే 3 కోట్లు తీసుకుందని సమాచారం అందుతుంది.

వీరితో పాటు ఈ చిత్రలో లైగర్ కు కోచ్ గా కనిపించిన రోనిత్ రూ. 1.5 కోట్లు తీసుకున్నారట. అలాగే తల్లి పాత్రలో నటించిన రమ్యకృష్ణ కు రూ. 1 కోటి పారితోషికం అందుకున్నట్లు తెలుస్తుంది. ప్రధాన తారగాణానికే రూ. 80.5 కోట్ల బడ్జెట్ అయిందని సమాచారం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు