Akhil : వైల్డ్ సాలే వస్తున్నాడు

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ అక్కినేని హీరోగా నటిస్తున్న సినిమా “ఏజెంట్” అత్యంత భారీ బడ్జెట్ తో AK ఎంటర్టైన్మెంట్స్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. మలయాళ సూపర్ స్టార్ట్ మమ్ముట్టి ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ను రెండు నెలల క్రితం రిలీజ్ చేయడం జరిగింది. వైల్డ్ అండ్ రగ్గడ్ లుక్ లో అఖిల్ కనిపించి అందరిని షాక్ అయ్యేలా చేసారు. టాప్ క్లాస్ విజువల్స్ తో హాలివుడ్ సినిమాని తలపించేలా టీజర్ కట్ చేసారు. ఏప్రిల్ 28న సినిమాని రిలీజ్ చేస్తున్నట్టు యూనిట్ టీజర్ లో ఎనౌన్స్ చేసారు. దాదాపు 60 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్న, ఈ మూవీ కోసం అఖిల్ చాల కష్టపడ్డాడు. ఈ మూవీ సంబంధించి ఇప్పటికే రిలీజ్ చేసిన సాంగ్స్ మంచి హిట్ అయ్యాయి.

శనివారం అఖిల్ పుట్టిన రోజు కావడంతో బర్త్ డే విషెష్ చెప్తూ “ఏజెంట్” సినిమా పోస్టర్ ను AK ఎంటర్టైన్మెంట్స్ రిలీజ్ చేసారు. లాంగ్ హెయిర్ తో ఒక బిల్డింగ్ పైనుంచి జంప్ చేస్తూన్నఅఖిల్ హాలీవుడ్ యాక్షన్ హీరోకి త్రం ఏమాత్రం తీసిపోయూకుండా ఉన్నాడు. లుక్స్ పరంగా అఖిల్ మిస్టర్ హ్యాండ్సమ్, కానీ సరైన హిట్ లేక ఢీలా పడిపోయాడు. ప్రతి సినిమాకి ఎక్సపర్మెంట్ చేస్తూ, తనని తాను ప్రూవ్ చేసుకోవాలని ప్రయత్నిస్తూనే ఉన్నాడు.

ఏజెంట్ కోసం అయితే ఏకంగా సంవత్సరం పాటు బాడీ బిల్డ్ చేయడానికే కేటాయించాడు. ఇలా ప్రతి సినిమాకి అఖిల్ కష్టపడుతూనే ఉన్నాడు. కానీ ఆ కష్టానికి ఆశించినంత విజయం మాత్రం దక్కట్లేదు. అఖిల్ కి నేమ్ అండ్ ఫేం చాల ఈజీగానే వచ్చిన వాటిని నిలబెట్టుకోడానికి మాత్రం ఎప్పటికప్పుడు తన వంతు ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. ఏజెంట్ తో అయినా అభిమానులు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టాలని గట్టిగా ఫిక్స్ అయ్యాడు. ఇప్పుడు అఖిల్ కి కావాల్సిందల్లా ఒక డీసెంట్ హిట్ సినిమా.

- Advertisement -

ఏప్రిల్ 28 మన టాలీవుడ్ కి గోల్డెన్ డేట్, మరి అలాంటి గోల్డెన్ డేట్ రోజు రిలీజ్ అవ్వబోతున్న ఏజెంట్ ఏమవబోతుందో చూడాలి.ఏదేమైనా ఏజెంట్ నైనా అఖిల్ కి మంచి హిట్ కొట్టాలని ఆశిస్తూ..

విషింగ్ ఏ వెరీ హప్పియెస్ట్ బర్త్ డే అఖిల్ అక్కినేని

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు