Happy Birthday: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి జన్మదిన శుభాకాంక్షలు

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఈ పేరు టాలీవుడ్ లో ఒక సెన్సేషన్. మెగా హీరోగా ఎంట్రీ ఇచ్చి తన టాలెంట్ తో స్టైలిష్ స్టార్ గా ఎదిగి యూత్ ఫేవరేట్ గా నిలిచాడు. ఇప్పుడు పుష్ప సినిమా తో ఐకాన్ స్టార్ గా ఇండియా వైడ్ గా క్రేజ్ సంపాదించుకున్నాడు. ఈ రోజు (ఏప్రిల్ 8) అల్లు అర్జున్ బర్త్ డే. ఈ సందర్బంగా తనకు బర్త్ డే విషెస్ చెప్తూ ఆయన గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం.

అల్లు అర్జున్ 1983 ఏప్రిల్ 8 న అల్లు అరవింద్,నిర్మల దంపతులకి జన్మించాడు. చెన్నై లో పుట్టిన అర్జున్ కి చిన్నతనం నుంచే సినిమాలు చాలా ఇష్టం. అల్లు రామ లింగయ్య మనవడిగా, అల్లు అరవింద్ కొడుకుగా మంచి బాక్ గ్రౌండ్ తో ఇండస్ట్రీ లోకి వచ్చాడు అల్లు అర్జున్. తన మావయ్య అయిన మెగాస్టార్ చిరంజీవి అంటే అల్లు అర్జున్ కి చాలా ఇష్టం. చాలా చోట్ల ఆయన్ని అనుకరించేవాడు. ఇండస్ట్రీ లో  తనకి ఇన్స్పిరేషన్ చిరంజీవి గారే అని ఎప్పుడూ చెప్తుంటాడు. అల్లు అరవింద్, చిరంజీవిల ప్రోత్సాహంతోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు.

అల్లు అర్జున్ 2003 లో లెజెండరీ డైరెక్టర్ కే.రాఘవేంద్రరావు దర్శకత్వంలో గంగోత్రి సినిమా ద్వారా టాలీవుడ్ లోకి హీరోగా గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చాడు. అయితే అంతకు ముందే అల్లు అర్జున్ విజేత, స్వాతిముత్యం సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా కనిపించాడు. ఇక చిరంజీవి నటించిన డాడీ సినిమాలో ఒక డాన్సర్ గా స్మాల్ రోల్ లో కనిపించాడు. అయితే మొదటి సినిమా గంగోత్రి యావరేజ్ గా ఆడింది. అల్లు అర్జున్ లుక్స్ పై కూడా ఎన్నో విమర్శలు వచ్చాయి. అయినా సరే పట్టు వదలకుండా సుకుమార్ తో ఆర్య సినిమా చేసాడు. 2004 లో విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. తన పై విమర్శలు చేసిన వారి నోళ్లు మూయించాడు. 16 కోట్లకి పైగా షేర్ వసూలు చేసిన ఈ సినిమా 56 సెంటర్లలో వంద రోజులాడింది. ఆ తర్వాత చేసిన బన్నీ, హ్యాపీ సినిమాలు యావరేజ్ గా ఆడినా, ఈ సినిమాలు అల్లు అర్జున్ కి మంచి పేరు తెచ్చి పెట్టాయి. సినిమాలో తాను చేసే డాన్సులకి ఆడియన్స్ ఫిదా అయిపోయేవారు.

- Advertisement -

అయితే ఆ తర్వాత వచ్చిన ‘దేశ ముదురు’ బన్నీ కెరియర్ ని మలుపు తిప్పింది. మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా ని పూరి జగన్నాథ్ డైరెక్ట్ చేశాడు. 2007 లో విడుదలైన ఈ సినిమా 26 కోట్లకి పైగా షేర్ ని వసూలు చేసింది. 129 సెంటర్లలో వంద రోజులు ఆడిన ఈ సినిమా 10 సెంటర్లలో 175 రోజులాడింది. ఆ తర్వాత పరుగు సినిమా తో పలకరించాడు. ఆర్య 2 సినిమా తో స్టయిలిష్ స్టార్ గా ప్రేక్షకులకి చేరువయ్యాడు. ఆ తర్వాత వరుడు, వేదం, బద్రీనాథ్ సినిమాలు కమర్షియల్ గా ఆడలేదు. కానీ వేదం సినిమా అల్లు అర్జున్ లోని నటనని వెలికితీసి విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

ఆ తర్వాత వచ్చిన ప్రతి సినిమాలోను తన లుక్స్ విషయంలోనూ డాన్స్ పరంగాను ఎన్నో వేరియేషన్స్ ని చూపించాడు. జులాయి, రేసు గుర్రం, సరైనోడు, లాంటి సినిమాలతో బ్లాక్ బస్టర్స్ కొట్టిన అర్జున్, తన బావ అయిన రామ్ చరణ్ తో ఎవడు సినిమా లో నటించాడు. కానీ ఈ మూవీ లో వాళ్లిద్దరూ కలిసి నటించిన సీన్లు ఉండవు. ఇటు మలయాళం లో అల్లు అర్జున్ నటించిన ప్రతి సినిమా విడుదలవుతుంది. మలయాళంలో మంచి ఫ్యాన్ బేస్ ఉన్న ఏకైక తెలుగు స్టార్ అల్లు అర్జున్. కేరళ ఫ్యాన్స్ అర్జున్ ని అక్కడ మల్లు అర్జున్ అని పిలుచుకుంటారు.

ఇటు అల్లు అర్జున్ పర్సనల్ లైఫ్ గురించి వస్తే 2011 లో స్నేహ రెడ్డి ని పెళ్లి చేసుకున్నాడు. టాలీవుడ్ లో మోస్ట్ ఫేవరేట్ సెలబ్రిటీ కపుల్స్ లో వీళ్ళు ఒకరు. అల్లు అర్జున్ కి ఇద్దరు పిల్లలున్నారు. కొడుకు అల్లు అయాన్, కూతురు అల్లు ఆర్హ.

2020 లో అల్లు అర్జున్ అలవైకుంఠపురం లో సినిమా తో వచ్చి మరో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టగా, ఆ తర్వాత సుకుమార్ డైరెక్షన్ లో వచ్చిన పుష్ప సినిమా తో కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ కొట్టాడు. 2021 లో పుష్ప పాన్ ఇండియా మూవీ గా విడుదలై నేషనల్ వైడ్ గా బన్నీ కి భారీ ఫాలోయింగ్ ని తెచ్చి పెట్టింది. ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప 2 లో నటిస్తున్నాడు. శుక్రవారం ఈ సినిమా నుంచి విడుదలైన గ్లింప్స్, ఫస్ట్ లుక్ పోస్టర్ తో సినిమా పై భారీ హైప్ వచ్చింది. ఈ సినిమా 2024 లో విడుదలవుతుంది. మరొక్కసారి అల్లు అర్జున్ కి “filmify” టీమ్ తరపున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు