Hanuman: చరిత్ర సృష్టించిన హనుమాన్.. అందుకున్న అరుదైన ఫీట్..!

Hanuman

ప్రముఖ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో యంగ్ హీరో తేజ సజ్జ నటించిన చిత్రం హనుమాన్.. కేవలం రూ.60 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా.. మూడు వారాల్లోనే రూ.300 కోట్లు కలెక్షన్లకు చేరువై రికార్డు సృష్టించింది. అంతేకాదు అత్యధిక వసూలు సాధించిన సంక్రాంతి సినిమాగా రికార్డు సృష్టించడమే కాదు తెలుగు సినిమా చరిత్రలో సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది.  మొదటి ఆట నుంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోయిన ఈ సినిమా తెలుగు,  హిందీ భాషలలో కలెక్షన్ల వర్షం కురిపించింది. సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన సూపర్ స్టార్ మహేష్ బాబు లాంటి హీరోల సినిమాలతో కూడా పోటీ పడుతూ.. చిన్న సినిమాగా విడుదలై నేడు ప్రభంజనం సృష్టిస్తోంది..
పలువురు సెలబ్రిటీలు , రాజకీయ నాయకులు కూడా ఈ సినిమా పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ సినిమా ఒక అరుదైన రికార్డును నెలకొంది. టాప్ కలెక్షన్స్ సాధించిన సినిమాలలో నంబర్ వన్ స్థానంలో నిలిచింది . సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని పంచుకుంటూ ఆనందం వ్యక్తం చేసింది చిత్రబృందం.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకుల ప్రేమతో హనుమాన్ సినిమా రికార్డు సృష్టించింది.. 92 ఏళ్ల టాలీవుడ్ ప్రస్థానంలో ఆల్ టైం సంక్రాంతి బ్లాక్ బాస్టర్ గా ఈ సినిమా నిలిచింది.. అంటూ చిత్రబృందం వెల్లడించింది. ఇకపోతే మూడు వారాల్లోనే రూ.300 కోట్లు వసూలు చేసి సంచలనం సృష్టించింది.
Hanuman is the number one movie with top collections
మరోవైపు ఈ సినిమాకి సీక్వల్ గా జై హనుమాన్ రాబోతున్నట్లు ఇదివరకే చిత్ర బృందం వెల్లడించింది.  అంతేకాదు ఈ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా మొదలయ్యాయి.  ఇందులో మెయిన్ హీరోగా ఒక బాలీవుడ్ స్టార్ హీరోని తీసుకోబోతున్నట్లు సమాచారం . ఇక ఆన్ స్క్రీన్ తోపాటు ఆఫ్ స్క్రీన్ లో కూడా వారి ఇమేజ్ నెక్స్ట్ లెవెల్ లో ఉండాలి.. చూడగానే భక్తి భావం కలగాలి.. అలాంటి వారిలో చిరంజీవి , మహేష్ బాబు ఉండొచ్చు అంటూ దర్శకుడు ప్రశాంత్ ఇటీవల వ్యాఖ్యానించారు. ముఖ్యంగా రాముడిగా మహేష్ బాబు తన మనసులో ఉన్న నటుడు అని,  ఆంజనేయుడుగా చిరంజీవి ఉన్నారు అంటూ ఆయన చెప్పారు.
ఇకపోతే పార్ట్ వన్ లో కనిపించిన తేజ కూడా పార్ట్ 2 లో కనిపిస్తాడు అని స్పష్టం చేశాడు ప్రశాంత్ వర్మ . ఇక హనుమాన్ సినిమా కోసం ఓటీటీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ప్రస్తుతం థియేటర్లలో సత్తా చాటుతున్న ఈ సినిమా.. ఓటీటీ లోకి త్వరలోనే రాబోతోంది.
Check out Filmify Telugu for Tollywood Movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు