Vijay Political Entry : సినిమాలపై విజయ్ షాకింగ్ డెసిషన్… మరో పవన్ కళ్యాణ్ అవుతారా?

Vijay Political Entry

తమిళ స్టార్ హీరో విజయ్ పొలిటికల్ ఎంట్రీ కన్ఫామ్ చేసి తాజాగా వార్తల్లో నిలిచారు. దాంతోపాటు ప్రస్తుతం తాను కమిట్ అయిన ఒక్క సినిమాను మాత్రమే చేస్తానని, ఆ తర్వాత పూర్తిగా రాజకీయాలపైనే ఫోకస్ చేస్తానని విజయ్ ప్రకటించడం సంచలనంగా మారింది. మరి విజయ్ కూడా పవన్ బాటలోనే నడుస్తున్నారా?

చాలా కాలంగా రాజకీయాలపై ఆసక్తి కనబరుస్తున్న విజయ్ పొలిటికల్ ఎంట్రీ గురించి వార్తలు వస్తున్నాయి. తాజాగా తన రాజకీయ పార్టీ పేరును అనౌన్స్ చేసి ఆ వార్తలను నిజం చేశారు విజయ్. అయితే సినిమా ఇండస్ట్రీలోని స్టార్స్ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వడం అనేది ఇప్పుడు సర్వసాధారణం అయిపోయింది. కానీ పూర్తిగా సినిమాలను విడిచిపెట్టి రాజకీయాలకే అంకితం కాబోతున్నాను అంటూ తాజాగా విజయ్ చేసిన ప్రకటన ఆయన అభిమానుల్లో, నిర్మాతల్లో ఆందోళనను పెంచేసింది. ప్రస్తుతం తమిళ సినిమా ఇండస్ట్రీలో ఇళయ దళపతిగా మంచి పాపులారిటీ అందుకుంటున్న విజయ్ సినిమాలకు గుడ్ బై చెప్పడాన్ని వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ స్టార్ హీరో ప్రస్తుతం కోలీవుడ్ లోనే అత్యధిక పారితోషకం అందుకుంటున్న హీరో. ఆయన ప్రస్తుతం ఒక్కో సినిమాకు 150 కోట్లు పారితోషకంగా తీసుకుంటున్నాడు.

అలాగే టాక్ తో సంబంధం లేకుండా ఆయన సినిమాలన్నీ నిర్మాతలకు మంచి లాభాలను తెచ్చి పెడుతున్నాయి. ఏడాదికి రెండు సినిమాలు చేస్తూ వస్తున్న విజయ్ ఇకపై ఫుల్ టైం రాజకీయాల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. వచ్చే ఏడాది నుంచి పూర్తిస్థాయి రాజకీయాలపై దృష్టి సారిస్తానని వెల్లడించారు 2026లో తమిళనాడులో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలనే లక్ష్యంతో ఆయన ఇప్పటినుంచే కసరత్తులు ప్రారంభించారు. ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో ఆయన కెరియర్ పిక్స్ లో ఉండగా, ఇలాంటి సమయంలో సినిమాల నుంచి తప్పుకోవాలని విజయ్ తీసుకున్న నిర్ణయం సాహసోపేతం అనే చెప్పాలి.

- Advertisement -

టాలీవుడ్ లో పవన్ కళ్యాణ్ కూడా దాదాపుగా ఇలాగే చేశారు. కెరీర్ మంచి పిక్స్ లో ఉన్న టైంలోనే పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. అయితే ముందుగా సినిమాలను పూర్తిగా వదిలేస్తానని ప్రకటించిన పవన్ ఆ తర్వాత తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. రాజకీయాల కోసం ఖర్చు చేయడానికి కావాల్సిన డబ్బు తన దగ్గర లేదంటూ మళ్లీ సినిమాలు చేయడం ప్రారంభించారు. ఇప్పటికీ ఆయన క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు అనుకోండి, కానీ ప్రస్తుతం పవన్ రెండు పడవలపై కాలు పెట్టిన చేస్తున్న ప్రయాణమే ఇబ్బందికరంగా మారింది. ఒకవైపు సినిమాలు చేస్తూ, మరోవైపు రాజకీయాలపై ఫోకస్ చేశారు.

దీంతో ఇటు సినిమాల నాణ్యత తగ్గడం అభిమానులకు నచ్చలేదు. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్లో రానున్న ఎలక్షన్స్ కోసం కొంతకాలం సినిమాలను పక్కన పెట్టేశారు పవన్. ప్రస్తుతం ఆయన కోసం పలువురు దర్శకులు వెయిట్ చేస్తుండగా, పవన్ మాత్రం ఎలక్షన్స్ పూర్తయ్యేదాకా సినిమాల జోలికి వచ్చే అవకాశం లేదు. ఇప్పుడు విజయ్ కూడా దాదాపుగా ఇదే బాటలో నడుస్తుండడం విశేషం. మరి విజయ్ తాను స్టేట్మెంట్ ఇచ్చిన విధంగా పూర్తిగా రాజకీయాలకే పరిమితమైపోతారా? లేదంటే పవన్ కళ్యాణ్ లాగా మళ్లీ రెండు పడవల ప్రయాణం మొదలు పెడతారా? అనేది చూడాలి.

Check out Filmify Telugu for Tollywood Movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు