Yatra 2 Trailer : పొలిటికల్ హీట్ పెంచేలా “యాత్ర 2” ట్రైలర్

Yatra 2 Trailer

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి జీవితం ఆధారంగా రూపొందిన మూవీ “యాత్ర”. దీనికి సీక్వెల్ గా రాబోతున్న “యాత్ర 2” ట్రైలర్ తాజాగా రిలీజ్ అయింది. పొలిటికల్ హీట్ పెంచేలా ఉన్న ఈ ట్రైలర్ విశేషాలు ఏంటి? అంటే…

2004 ఎన్నికలకు ముందు రాజశేఖర్ రెడ్డి చేసిన పాదయాత్ర ఆధారంగా “యాత్ర” మూవీ రూపొందింది. 2019 ఏపీ ఎలక్షన్స్ ముందు ఫిబ్రవరిలో రిలీజ్ అయిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. “యాత్ర”కు మహి వి రాఘవ్ దర్శకత్వం వహించగా, ఈ మూవీలో మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి రాజశేఖర్ రెడ్డి పాత్రను పోషించారు. తాజాగా డైరెక్టర్ మహి వి రాఘవ్ “యాత్ర 2” పేరుతో సీక్వెల్ ను తెరపైకి తీసుకురాబోతున్నారు. 2019 ఎన్నికలకు ముందు రాజశేఖర రెడ్డి తనయుడు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి చేసిన పాదయాత్ర, రాజశేఖర్ రెడ్డి చనిపోయినప్పుడు జరిగిన పరిణామాలు, ఇప్పటి ముఖ్యమంత్రి జగన్ ను తొక్కేయడానికి ఎలాంటి ప్రయత్నాలు చేశారు? జగన్మోహన్ రెడ్డి ఎలా ముఖ్యమంత్రి అయ్యాడు అనే అంశాల నేపథ్యంలో “యాత్ర 2″ను తెరకెక్కిస్తున్నారు. ఈ సీక్వెల్ లో రాజశేఖర్ రెడ్డి పాత్రలో మమ్ముట్టి, జగన్మోహన్ రెడ్డి పాత్రలో తమిళ హీరో జీవా నటిస్తున్నారు. తాజాగా “యాత్ర 2” ట్రైలర్ రిలీజ్ అయింది.

“యాత్ర 2” ట్రైలర్లోని కొన్ని సన్నివేశాలు పొలిటికల్ గా పొగ పెట్టేలా కనిపిస్తున్నాయి. ఇందులో రాజశేఖర్ రెడ్డి ఆరోగ్యశ్రీ పథకాన్ని ఎలా తెరపైకి తీసుకొచ్చారు అని తెలిపే సన్నివేశం హృదయానికి హత్తుకునేలా ఉంది. వైయస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రను ఎలా అడ్డుకోవాలనుకున్నారు? అప్పట్లో జగన్మోహన్ రెడ్డిని జైలుకు పంపడానికి ఎవరెవరు ఎలాంటి పొలిటికల్ గేమ్ ఆడారు? అనే ఆసక్తికర విషయాలు ఈ మూవీలో ఉండబోతున్నాయి అన్న విషయాన్ని ట్రైలర్ ద్వారా వెల్లడించారు. ముఖ్యంగా అప్పటి కాంగ్రెస్ అధినాయకురాలు సోనియా గాంధీకి సంబంధించిన సన్నివేశాలు పొలిటికల్ గా హీట్ పెంచేలా ఉన్నాయి. త్వరలోనే ఏపీలో ఎలక్షన్స్ జరగనున్న నేపథ్యంలో రిలీజ్ కు రెడీ అవుతున్న “యాత్ర 2” మూవీ ఎఫెక్ట్ ఎలా ఉండబోతుందో చూడాలి.

- Advertisement -

ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో రానున్న ఎలక్షన్స్ కోసం జరుగుతున్న పరిణామాలు కాక రేపుతున్నాయి. ఇక ఇప్పుడు ఈ సినిమా వాటికి మరింత ఆజ్యం పోసినట్టుగా అవుతుంది. కాగా “యాత్ర 2” మూవీ ఫిబ్రవరి 9న భారీ ఎత్తున రిలీజ్ కాబోతోంది. వైయస్సార్ అభిమానులు ఈ మూవీ గురించి ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అయితే సినిమా ప్రమోషన్స్ విషయంలో మాత్రం పెద్దగా కాన్సెంట్రేట్ చేయట్లేదు మేకర్స్. అసలు తెలుగు రాష్ట్రాల్లో “యాత్ర 2” గురించి పెద్దగా బజ్ లేకపోవడం ఆశ్చర్యంగా అనిపిస్తుంది. కానీ ట్రైలర్ ద్వారా జనాల్లో కాస్త ఆసక్తిని పెంచే ప్రయత్నం చేశారు. మరో వారం రోజుల్లో రిలీజ్ కాబోతున్న “యాత్ర 2″కు ప్రేక్షకుల నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాబోతుంది అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు