Gopichand Remuneration : గోపిచంద్‌కు మార్కెట్ ఎక్కువే… కానీ, కుర్ర హీరోల కంటే తక్కువ రెమ్యునరేషన్

Gopichand Remuneration : టాలీవుడ్ లో యాక్షన్ హీరోగా తనకంటూ ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరో గోపీచంద్. ఈయన కెరీర్ హీరోగా మొదలై, విలన్ గా మలుపు తిరిగి మళ్ళి హీరోగా స్థిరపడింది. అయితే గోపీచంద్ సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి దాదాపు రెండు దశాబ్దాలు పూర్తి అవుతున్నప్పటికీ ఆయన తీసుకుంటున్న తాజా రెమ్యూనరేషన్ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. గోపీచంద్ మార్కెట్ ఎక్కువే అయినప్పటికీ, కుర్ర హీరోల కంటే ఆయన తక్కువ రెమ్యూనరేషన్ పుచ్చుకోవడం గమనార్హం.

రెమ్యూనరేషన్ లో గోపీచంద్ కంటే వాళ్ళే నయం…

గోపీచంద్ కెరీర్ ఓ పట్టాన సరైన పట్టాలు ఎక్కట్లేదు. 2014లో రిలీజ్ అయిన లౌక్యం మూవీతో చివరిసారిగా సూపర్ డూపర్ హిట్ కొట్టాడు గోపీచంద్. అప్పటి నుంచి ఇప్పటిదాకా వరుసగా ప్లాప్స్ ఎదుర్కొంటున్నాడు ఈ హీరో. ప్రతి సినిమాకి ఈసారైనా సాలిడ్ హిట్ కొట్టకపోతారా అని ఎదురు చూస్తున్నారు ఆయన అభిమానులు. కానీ ప్రతిసారి వారికి నిరశనే మిగులుస్తున్నాడు గోపీచంద్. ప్రస్తుతం ఉన్న ఇండస్ట్రీలోని పలువురు కుర్ర హీరోలతో పోల్చుకుంటే సీనియర్ హీరో గోపీచంద్ అత్యంత తక్కువ పారితోషకం అందుకుంటున్నారు.

రౌడీ హీరో విజయ్ దేవరకొండ వరుస డిజాస్టర్లు అందుకుంటున్నా పారితోషికం విషయంలో ఏమాత్రం తగ్గట్లేదు. రౌడీ హీరో ప్రస్తుతం ఒక్కో సినిమాకు 20 కోట్ల రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తే, రీసెంట్ సెన్సేషనల్ మూవీ టిల్లు స్క్వేర్ హీరో సిద్దు జొన్నలగడ్డ ఒక్కో సినిమాకు పారితోషికం పెంచుకుంటూ వెళ్తున్నాడు. సిద్ధూ ఇప్పుడు ఏకంగా 10 కోట్లు ఛార్జ్ చేస్తున్నాడు. వీళ్ళందరూ తమ మార్కెట్ తో సంబంధం లేకుండానే ఈ రేంజ్ లో పారితోషికం అందుకుంటున్నారు.

- Advertisement -

గోపీచంద్ మార్కెట్ వాల్యూ ఇదే

సీనియర్ హీరో అయిన గోపీచంద్ మాత్రం ఇప్పటికీ కేవలం 3 కోట్లు పారితోషకంగా తీసుకుంటున్నారు. ఆయన మార్కెట్ తో పోల్చుకుంటే ఇది చాలా తక్కువ అని చెప్పొచ్చు. గోపీచంద్ కు సరైన హిట్ లేకపోయినా ఆయన మార్కెట్ మాత్రం ప్రస్తుతం నాన్ థియేట్రికల్ రైట్స్ తో కలిపి 25 కోట్లు ఉంటుంది. కానీ గోపీచంద్ తన రేంజ్ కు తగ్గ పారితోషికాన్ని డిమాండ్ చెయ్యకపోవడం గమనార్హం. ప్రస్తుతం ఈ హీరో పారితోషికం కంటే తన కెరీర్ కు బూస్ట్ ఇచ్చే బ్లాక్ బస్టర్ హిట్ కోసం ఎదురు చూస్తున్నారు. అందుకే ఆయన పారితోషికాన్ని పెద్దగా పట్టించుకోట్లేదని తెలుస్తోంది.

రాము బాణం దెబ్బ గట్టిగానే తగిలిందా?

నిజానికి ఇది వరకు గోపీచంద్ 5 నుంచి 6 కోట్లు పారితోషకం అందుకునేవారు. కానీ 2023లో రిలీజ్ అయిన రామబాణం మూవీ ఆయన కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. దీంతో అప్పటిదాకా 5 నుంచి 6 కోట్ల రేంజ్ లో ఉన్న గోపీచంద్ పారితోషకాన్ని సగానికి తగ్గించుకోవాలని నిర్మాతలు డిమాండ్ చేశారని వార్తలు వచ్చాయి. ఇక తాను వేసిన తప్పటడుగుల ఫలితంగా 6 కోట్ల రెమ్యూనరేషన్ కాస్తా 3 కోట్లుగా మారింది గోపీచంద్ కు. రీసెంట్ గా రిలీజ్ అయిన భీమా కూడా ఆయనను ఈ డిజాస్టర్ ఫేజ్ నుంచి బయటపడే లేకపోయింది. ఈ మూవీ హిట్ టాక్ తెచ్చుకున్నప్పటికీ, కమర్షియల్ గా మాత్రం కలెక్షన్లు రాబట్టలేకపోయింది. ప్రస్తుతం గోపీచంద్ నటిస్తున్న విశ్వం మూవీ అయినా ఆయన రేంజ్ కు తగ్గ హిట్ ఇచ్చి, రెమ్యూనిరేషన్ పెంచేలా చేస్తుందేమో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు