Salman Khan : సెంటిమెంట్ పండగ ఈద్ ను వదిలేసిన సల్మాన్… ఒక్క అప్డేట్ తోనే సరిపెట్టుకోవాలా?

Salman Khan : బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సల్మాన్ సినిమాలని ఫస్ట్ డే ఫస్ట్ షో చూసేంత వీరాభిమానులు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉన్నారు. కానీ సల్మాన్ మాత్రం తాను సెంటిమెంట్ గా భావించే ఈద్ పండగకు ఫ్యాన్స్ ను నిరాశ పరిచాడు. సల్లూ భాయ్ ఫ్యాన్స్ ఈ ఏడాది ఈద్ కు ఒకే ఒక్క అప్డేట్ తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

ఈసారి ఈద్ ను వదిలేసిన సల్మాన్

అసలు విషయం ఏమిటంటే బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ గత కొన్నాళ్లుగా ప్రతి రంజాన్ రోజు ఏదో ఒక సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తూ హిట్టు కొడుతూ వస్తున్నాడు. అయితే ఈ ఏడాది మాత్రం ఆయన రంజాన్ కి ఎలాంటి సినిమాతోనూ ప్రేక్షకుల ముందుకు రాలేదు. నిజానికి సల్మాన్ ఖాన్ సినిమా రంజాన్ కి రిలీజ్ అయితే హిట్ అవుతుందని ఆయన మాత్రమే కాదు, ఆయన అభిమానులకి కూడా ఒక రకమైన సెంటిమెంట్. అందుకే కాస్త లేట్ అయినా సరే సినిమాని రంజాన్ రోజునే రిలీజ్ చేసేలా ప్లాన్ చేసుకుంటారు సల్మాన్.

ఈసారి రంజాన్ రోజు మాత్రం ఆసక్తికరంగా ఒక సినిమా అప్డేట్ ఇచ్చాడు. అదేంటంటే గత కొన్నాళ్లుగా సౌత్ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో సల్మాన్ ఖాన్ ఒక సినిమా చేసే అవకాశం ఉందని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఆ ప్రచారాన్ని నిజం చేస్తూ తాను మురుగదాస్ దర్శకత్వంలో సికిందర్ అనే సినిమా చేస్తున్నానని, అది వచ్చే ఏడాది రంజాన్ రోజు రిలీజ్ అవుతుందని చెప్పుకొచ్చాడు అంతేకాదు ఈ ఏడాది తన సినిమాలు లేవు కాబట్టి చోటే మియన్ బడే మియా సినిమాతో పాటు మైదాన్ సినిమా చూసి రంజాన్ జరుపుకోవాలని, వచ్చే రంజాన్ మాత్రం తన సికిందర్ సినిమాతో జరుపుకోవాలని చెప్పుకొచ్చాడు. ఈ సినిమాని నిర్మాత సాజిద్ నదియావాలా నిర్మిస్తున్నాడు. వీరిద్దరిది సూపర్ హిట్ కాంబినేషన్ గతంలో ఇద్దరు కలిసి చేసిన సినిమాలు సూపర్ హిట్లుగా నిలిచాయి.

- Advertisement -

మురుగదాస్ కు ఇదే మొదటి హిందీ మూవీ కాదు

కోలీవుడ్ డైరెక్టర్ మురగదాస్ కి ఇది మొదటి బాలీవుడ్ సినిమా కాదు. గతంలోనే ఆయన తమిళంలో చేసిన గజినీ సినిమాని హిందీలో అమీర్ ఖాన్ హీరోగా రిమేక్ చేశాడు. మొదటి సినిమాతోనే 100 కోట్లు అందుకున్న మురుగదాస్ అక్కడే స్థిరపడిపోతాడేమో అనుకున్నారు. కానీ ఆ తర్వాత అక్షయ్ కుమార్ తో చేసిన ఒక సినిమా దారుణమైన డిజాస్టర్ గా నిలవడంతో ఆయన మళ్లీ సౌత్ దారి పట్టారు.

రంజాన్ రోజునే రిలీజైన సల్మాన్ మూవీస్ ఇవే

సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన వాంటెడ్, సుల్తాన్, దబాంగ్, ఏక్ థా టైగర్, బజరంగీ భాయిజాన్ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలు అన్నీ రంజాన్ రోజునే రిలీజ్ అయ్యాయి. కానీ గత రెండు సల్మాన్ సినిమాలకు రంజాన్ సెంటిమెంట్ వర్కౌట్ కాలేదు. కిసీ కా భాయ్ కిసీ కి జాన్, టైగర్ 3 సినిమాలు డిజాస్టర్ గా నిలవడంతో ప్రస్తుతం సల్మాన్ కాస్త బ్రేక్ తీసుకున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు