AA Combo : ఫస్ట్ అట్లీ, నెక్స్ట్ గురూజీ… తమిళ దర్శకుడికే బన్నీ ఇంపార్టెన్స్

AA Combo : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం “పుష్ప” సీక్వెల్ తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఇక ఈ మూవీ తర్వాత బన్నీ లైన్ అప్ లో క్రేజీ డైరెక్టర్ ఉన్నారు. మరి ఆయన నెక్స్ట్ మూవీ ఎవరితో ఉండబోతోంది అని చర్చ జరుగుతున్న నేపథ్యంలో బన్నీ తమిళ దర్శకుడికే ఇంపార్టెన్స్ ఇచ్చి, ఆయనతోనే సినిమా చేయబోతున్నాడు. బన్నీ నెక్స్ట్ మూవీ అట్లీతో ఉండబోతోంది అని సమాచారం.

నిజానికి గత కొంతకాలం నుంచి బన్నీ నెక్స్ట్ మూవీ త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఉండబోతోంది అని ప్రచారం జరుగుతుంది. కానీ హఠాత్తుగా అట్లీ త్రివిక్రమ్ శ్రీనివాస్ స్థానాన్ని కబ్జా చేసేశారు. “పుష్ప 2” తర్వాత అల్లు అర్జున్ త్రివిక్రమ్, సందీప్ రెడ్డి వంగాలతో సినిమాకు కమిట్ అయ్యాడు. వీరిద్దరితో పాటు మరికొందరు పాన్ ఇండియన్ డైరెక్టర్లు అల్లు అర్జున్ తో సినిమా చేయడానికి వెయిట్ చేస్తున్నారంటూ టాలీవుడ్ లో ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలోని అట్లి పేరు తెరపైకి వచ్చింది. ఈ ఏడాది “జవాన్” సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్న డైరెక్టర్ అట్లీతో ఓ సినిమా చేయడానికి అల్లు అర్జున్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి.

“పుష్ప 2” మూవీ షూటింగ్ పూర్తి అయిన తర్వాత అల్లు అర్జున్- అట్లీ కాంబోలో రూపొందనున్న మూవీ సెట్స్ పైకి వెళ్ళనున్నట్టు సమాచారం. అంతేకాకుండా అట్లీ మూవీతోనే అల్లు అర్జున్ అఫీషియల్ బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడని అంటున్నారు. ఈ మూవీ భారీ బడ్జెట్ తో పాన్ ఇండియన్ లెవెల్ లో హై ఇంటెన్స్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఉండబోతుందని, ఈ మూవీకి యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ సంగీతాన్ని అందించబోతున్నాడని తెలుస్తోంది. 2024 ఎండింగ్ లో అల్లు అర్జున్- అట్లీ మూవీ షూటింగ్ స్టార్ట్ కానుందని, ఇప్పటికే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన స్క్రిప్ట్ ను అట్లీ రెడీ చేసి పెట్టాడని, త్వరలోనే ఈ మూవీని నిర్మించబోతున్న సన్ పిక్చర్స్ అఫీషియల్ గా ఈ పాన్ ఇండియా మూవీని అనౌన్స్ చేయబోతుందని సమాచారం.

- Advertisement -

ఇక అట్లితో మూవీ పూర్తయ్యాకనే త్రివిక్రమ్ ప్రాజెక్టును బన్నీ పట్టాలెక్కించబోతున్నాడు. త్రివిక్రమ్ మూవీ సోషియో ఫాంటసీ బ్యాగ్రౌండ్ తో రాబోతోందని, ఆ కథను సిద్ధం చేయడానికి చాలా సమయం పట్టే అవకాశం ఉండడంతో పక్కనపెట్టి అట్లీతో మూవీ చేయడానికి బన్నీ సిద్ధమయ్యాడని తెలుస్తోంది. ఇక “పుష్ప 2” మూవీ షూటింగ్ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉండగా, రీసెంట్ గా హైదరాబాద్లోని రామోజీ ఫిలిం సిటీలో కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించారు. జనవరి 4 నుంచి ఈ మూవీ నెక్స్ట్ షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది. 2024 ఆగస్టులో “పుష్ప 2” మూవీని రిలీజ్ చేయబోతున్నట్టు ఇప్పటికే ప్రకటించారు.

check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు