Guntur Kaaram: గురూజీ సెంటిమెంట్… ప్రీ రిలీజ్ ఈవెంట్ అక్కడే?

Guntur Kaaram: క్రిస్మస్ సెలబ్రేషన్స్ పూర్తయ్యాయి. దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న “సలార్” మూవీ థియేటర్లలోకి వచ్చేసింది. ఇక ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తో నడుస్తుండడంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఆకలి తీరిపోయింది. ఇప్పుడు మహేష్ బాబు ఫ్యాన్స్ విందుకు సమయం ఆసన్నమైంది. దీంతో అందరూ “గుంటూరు కారం” మూవీ అప్డేట్స్ పై ఆసక్తిని కనుబరుస్తున్నారు. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎక్కడ జరుగుతుంది? ఎప్పుడు జరుగుతుంది? అనే విషయాలపై చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే “గుంటూరు కారం” టీం గురూజీ సెంటిమెంట్ ప్లేస్ లో ఫ్రీ రిలీజ్ ఈవెంట్ జరపబోతున్నారు అనే సమాచారం బయటకు వచ్చింది. ఇంతకీ గురూజీ ప్లాన్ ఏంటి? “గుంటూరు కారం” మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ఎక్కడ జరగబోతోంది? అనే వివరాల్లోకి వెళితే…

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న మాస్ మసాలా ఎంటర్టైనర్ “గుంటూరు కారం” మూవీ షూటింగ్ చివరి దశలో ఉంది. ప్రస్తుతం హైదరాబాదులో ఈ మూవీకి సంబంధించిన చివరి పాటను షూట్ చేస్తున్నారు. డిసెంబర్ 27లోపు “గుంటూరు కారం” మూవీ షూటింగ్ పాటలతో సహా పూర్తి కాబోతోంది. ఇక ఈ మూవీని సంక్రాంతి కానుకగా థియేటర్లలోకి తీసుకురాబోతున్నాం అని ఇప్పటికే మేకర్స్ అనౌన్స్ చేశారు. ఇక సంక్రాంతికి ఇంకా కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఈ 15 – 20 రోజుల్లో “గుంటూరు కారం” మూవీ ప్రమోషన్స్ స్టార్ట్ చేయాల్సి ఉంటుంది.

అయితే మహేష్ బాబు ఈ మూవీ షూటింగ్ అనంతరం ఫ్యామిలీతో కలిసి న్యూ ఇయర్ వెకేషన్ కు వెళ్లబోతున్నారు. వారం పాటు మహేష్ ట్రిప్ ఉండబోతోంది. ఆయన హైదరాబాద్ కు తిరిగి వచ్చిన తరువాతే “గుంటూరు కారం” మూవీ ప్రమోషన్స్ స్టార్ట్ కాబోతున్నాయి. అంతలోపు నిర్మాతలు ఈ మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు సంబంధించిన సన్నాహాలు మొదలు పెట్టేసారు. ఫిలిం సర్కిల్స్ నుంచి అందుతున్న సమాచారం మేరకు గురూజీ సెంటిమెంట్ గా భావిస్తున్న ఓ ప్లేసులో “గుంటూరు కారం” మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతుందని తెలుస్తోంది.

- Advertisement -

త్రివిక్రమ్ సెంటిమెంట్ గా భావిస్తున్న ఆ ప్లేస్ కూడా పోలీస్ గ్రౌండ్స్. ఇక్కడే త్రివిక్రమ్ – అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన ఇండస్ట్రీ హిట్ మూవీ “అల వైకుంఠపురం”లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. బన్నీ ఈ మూవీతో ఎలాంటి రికార్డులు తిరగరాసాడో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన కెరీర్ లోనే ఓ మరచిపోలేని మధురమైన మూవీగా మిగిలిపోయింది “అల వైకుంఠపురం”లో. ఇటు త్రివిక్రమ్ శ్రీనివాస్ కు కూడా ఇది మంచి మెమోరీగా మారింది. ఈ కారణంతోనే యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ ను సెంటిమెంట్ గా భావించి, అక్కడే “గుంటూరు కారం” మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ప్లాన్ చేస్తున్నారట గురూజీ.

ఇక ఈ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ భారీ ఎత్తున జరగబోతుందని, డిసెంబర్ 6న “గుంటూరు కారం” మూవీ ఈవెంట్ జరుగుతుందని సమాచారం. ఇక మహేష్ అభిమానులకు పూనకాలు తెప్పించే మరో క్రేజీ అప్డేట్ ఏమిటంటే ట్రైలర్ ను కూడా అప్పుడే రిలీజ్ చేయబోతున్నారు. ప్రస్తుతం “గుంటూరు కారం” టీం దీనికి సంబంధించిన పనుల్లోనే బిజీగా ఉన్నారు. మరి గురూజీ సెంటిమెంట్ ప్రకారం “గుంటూరు కారం” మూవీ కూడా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందా అనేది వేచి చూడాలి.

check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు