Devara: మెంటల్ మాస్ డైలాగ్ లీక్… ఇది కదా కావాల్సింది

Devara: యంగ్ టైగర్ ఎన్టీఆర్ లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ “దేవర” మూవీ అప్డేట్స్ కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు నందమూరి అభిమానులు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ మూవీ నుంచి లీకైన ఓ మెంటల్ మాస్ డైలాగ్ తారక్ ఫ్యాన్స్ కు మంచి కిక్ ఇస్తుంది. మరోవైపు ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్లను నిర్మాత కళ్యాణ్ రామ్ బయట పెట్టేశారు. ఇంతకీ “దేవర” మూవీ నుంచి లీకైన ఆ మాస్ డైలాగ్ ఏంటి? కళ్యాణ్ రామ్ ఈ మూవీ గురించి ఎలాంటి అప్డేట్స్ ఇచ్చాడు? అనే వివరాల్లోకి వెళితే…

ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ “దేవర”. ఈ మూవీలో జాన్వి కపూర్ హీరోయిన్ కాగా, “దేవర”తో ఈ బాలీవుడ్ బ్యూటీ టాలీవుడ్ లో అడుగు పెట్టబోతోంది. ఇక ఈ భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీని హరి కొసరాజు, సుధాకర్ మిక్కిలినేనిలతో కలిసి హీరో కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్నారు. తాజాగా కళ్యాణ్ రామ్ నటించిన “డెవిల్” మూవీ రిలీజ్ సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో “దేవర” బడ్జెట్ గురించి, అలాగే షూటింగ్ గురించి కీలక అప్డేట్స్ వెల్లడించారు.

“దేవర” షూటింగ్ ఇప్పటికే 80% పూర్తయిందని, ఇదివరకు ఎన్నడూ టాలీవుడ్ సిల్వర్ స్క్రీన్ పై చూడని విజువల్ వండర్ గా “దేవర” ఉండబోతుందని, హాలీవుడ్ టెక్నీషియన్స్, ఫైట్ మాస్టర్ ఈ మూవీ కోసం పని చేస్తున్నారని కళ్యాణ్ రామ్ వెల్లడించారు. అంతేకాకుండా దేవర అప్డేట్స్ విషయంలో అభిమానులు చాలా డిసప్పాయింట్ అయ్యారని, అయితే కంటెంట్ విషయంలో కాన్ఫిడెంట్ గా ఉన్నప్పుడే సినిమాకు సంబంధించిన అప్డేట్స్ ప్రకటించడానికి ఇష్టపడతామని, కంటెంట్ అంతా రెడీ అయ్యాకే “దేవర” టీజర్, గ్లిమ్స్ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేస్తామని చెప్పుకొచ్చాడు. ఇక 300 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ మూవీ రూపొందుతుంది అనే రూమర్స్ పై స్పందించిన కళ్యాణ్ రామ్ అనుకున్న బడ్జెట్లోనే ఈ మూవీ షూటింగ్ జరుగుతోందని, కానీ తను బడ్జెట్ ను రివీల్ చేయను అని తేల్చేశాడు.

- Advertisement -

ఇక మరోవైపు “దేవర” మూవీ నుంచి లీకైన మాస్ డైలాగ్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ డైలాగ్ ఏంటంటే… “యమ పాషంతో ఉయ్యాల ఊగాలి అని సూస్తే అది మెడకు సుట్టుకుని సావును పరిచయం చేస్తుంది” అంటూ సినిమాలో ఒకానొక సందర్భంలో ఎన్టీఆర్ చెప్పబోయే డైలాగ్ సినిమాకే హైలైట్ అవుతుందని అంటున్నారు. ఇక ఈ డైలాగ్ తో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు మంచి కిక్ రాగా, ఇది కదా కావాల్సింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక “దేవర” మూవీకి సంబంధించిన ప్రతి అప్డేట్ ను కూడా చాలా గోప్యంగా ఉంచుతున్నారు చిత్ర బృందం. అయినప్పటికీ ఈ డైలాగ్ మాత్రం లీక్ అయింది. కాగా “దేవర” ఫస్ట్ పార్ట్ 2024 ఏప్రిల్ లో రిలీజ్ కానుంది.

check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు