Sankranthi Movies : మాకే థియేటర్లు దిక్కులేవు… మళ్ళీ డబ్బింగ్ సినిమాలా?

Sankranthi Movies : ఈ సంక్రాంతి పండగ అంతా టాలీవుడ్ లోనే జరగబోతోంది. ఈసారి ఏకంగా ఐదు సినిమాలు సంక్రాంతి బరిలో పోటీ పడబోతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కొన్ని తమిళ సినిమాలు కూడా తెలుగు ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నాయి. కానీ తెలుగు స్టార్ హీరోలే సంక్రాంతి సీజన్ లో థియేటర్ల కోసం కొట్టుకు చస్తుంటే, డబ్బింగ్ సినిమాలకు థియేటర్లు ఎక్కడ నుంచి వస్తాయి?

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన “గుంటూరు కారం”, విక్టరీ వెంకటేష్ “సైంధవ్”, రవితేజ లేటెస్ట్ మూవీ “ఈగల్”, కింగ్ నాగార్జున “నా సామి రంగ”, తేజ సజ్జ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా మూవీ “హనుమాన్” 2024 సంక్రాంతి కానుకగా రిలీజ్ కావడానికి రెడీ అవుతున్నాయి. ఇన్ని సినిమాలు రిలీజ్ అవ్వడం వాళ్లకు కూడా లాభదాయకం కాదని ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు దిల్ రాజు సర్ది చెప్పడానికి ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. రెండుసార్లు ఈ సినిమాల నిర్మాతలను పిలిచి మీటింగ్ పెట్టినా ఎవరికి వారే సంక్రాంతికి తమ సినిమాలను కచ్చితంగా రిలీజ్ చేసి తీరుతామని, తగ్గేదే లే అంటూ మంకుపట్టు పట్టుకుని కూర్చున్నారు.

ఇక దిల్ రాజు ఏకంగా ఇప్పుడు పోస్ట్ పోన్ చేసుకున్న సినిమాలకు ఫిలిం ఛాంబర్ నుంచి సోలో రిలీజ్ డేట్ ను ఇస్తామని ఆఫర్ ఇచ్చినా ఎవ్వరూ వెనక్కి తగ్గలేదు. దీంతో చేసేది లేక ఆయన కూడా చేతులెత్తేశారు. కానీ ఒకవేళ ఎవరైనా తమ సినిమాలను పోస్ట్ పోన్ చేసుకునే ఆలోచనలు ఉంటే తనకు తెలియజేయాలని సూచించారు. టాలీవుడ్ లో స్టార్ హీరోల పరిస్థితి ఇలా ఉంటే మరోవైపు తమిళ సినిమాలు కూడా ఈ సంక్రాంతికి పోటీలోకి దిగుతున్నాయి. ధనుష్ హీరోగా నటించిన “కెప్టెన్ మిల్లర్”, శివ కార్తికేయన్ “అయాలాన్”, విజయ్ సేతుపతి “మెర్రీ క్రిస్మస్”, అరుణ్ విజయ్ “మిషన్” వంటి తమిళ సినిమాలు ఈ సంక్రాంతికి రిలీజ్ కాబోతున్నాయి.

- Advertisement -

ఇక ఇప్పటికే నెలకొన్న పోటీని చూసి రజినీకాంత్ ముఖ్యమైన పాత్రలో నటించిన “లాల్ సలామ్” మూవీని వాయిదా వేసుకున్నారు. ఇక సంక్రాంతికి తమ సినిమాలను రిలీజ్ చేయడానికి రెడీగా ఉన్న ధనుష్, విజయ్ సేతుపతి, శివ కార్తికేయన్ వంటి హీరోల కు టాలీవుడ్ లోనూ మంచి క్రేజ్ ఉంది. కానీ థియేటర్లే లేవు. ఈ తమిళ సినిమాలన్నీ తెలుగు రాష్ట్రాల్లో కూడా సమానంగా విడుదల చేయడానికి ప్లాన్ చేసుకున్నాయి. కానీ సంక్రాంతికి చాలా తెలుగు సినిమాలు పోటీకి దిగడంతో ఇక్కడ వాళ్లకు థియేటర్లు దొరికే అవకాశం లేనేలేదు.

ఇటీవల జరిగిన మీడియా సమావేశంలో నిర్మాత దిల్ రాజు కూడా ఇదే విషయాన్ని వెల్లడించారు. తెలుగు సినిమాలకే సరిపడా థియేటర్లు లేవని, ఇలాంటి సమయంలో డబ్బింగ్ సినిమాలకు థియేటర్లు ఇవ్వలేమని తేల్చి చెప్పేశారు. ముందుగా తెలుగు సినిమాలకే ప్రాధాన్యత ఇస్తామని, ఆ తర్వాత ఏవైనా థియేటర్లు మిగిలి ఉంటే డబ్బింగ్ సినిమాలకు ఇస్తామని ఖరాకండిగా చెప్పేశారు. కాబట్టి ఈ సంక్రాంతి సీజన్ కు తమిళ స్టార్ హీరోలు టాలీవుడ్ థియేటర్లపై ఆశలు వదిలేసుకోవాల్సిందే.

check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు