Tolly wood: టాలీవుడ్ లో భారీ అగ్నిప్రమాదం… షాక్ లో నిర్మాతలు..?

Fire breaks out at DRR Studio Rajarhat: టాలీవుడ్ ఇండస్ట్రీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దేశవ్యాప్తంగా చూసుకున్నట్లయితే మన టాలీవుడ్ ఇండస్ట్రీకి ప్రత్యేక పేరు ఉంది. బాలీవుడ్ తర్వాత టాలీవుడ్ అన్నట్లుగా ఒకప్పుడు ఉండేది. కానీ పుష్ప, బాహుబలి మరియు త్రిపుల్ ఆర్ లాంటి సినిమాలు వచ్చాక బాలీవుడ్ కూడా టాలీవుడ్ వెనుక ఉండిపోయింది. ఇక్కడి దర్శక నిర్మాతలతో బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు సినిమాలు చేసేందుకు ముందుకు వస్తున్నారు.

అయితే అలాంటి టాలీవుడ్ ఇండస్ట్రీలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో భారీ ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం అందుతుంది. అయితే టాలీవుడ్ ఇండస్ట్రీ అంటే మన తెలుగు ఇండస్ట్రీ అనుకునేరు. అది కాదండోయ్. టాలీవుడ్ ఇండస్ట్రీ మన తెలుగులోనే కాకుండా పశ్చిమబెంగాల్లో కూడా ఉంది. అదేంటి అలా చెబుతున్నారు. మీకు పిచ్చా ఏంటి ? అనుకుంటున్నారా ? అసలు విషయం చెప్పేవరకు వినండి కాస్త.

Fire breaks out at DRR Studio Rajarhat
Fire breaks out at DRR Studio Rajarhat

పశ్చిమబెంగాల్ సినీ పరిశ్రమకు కూడా టాలీవుడ్ అనే పేరు ఉందట. మనకంటే మొదటగా వారి ఇండస్ట్రీకి టాలీవుడ్ అని పేరు ఉందని సమాచారం. అక్కడి నుంచే మనకు టాలీవుడ్ అనే పేరు వచ్చిందని కూడా కొంతమంది చెబుతారు. అందుకే టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ని ప్రమాదం జరిగిందని ముందుగా చెప్పాము. అసలు వివరాల్లోకి వెళ్తే… పశ్చిమ బెంగాల్ రాజధాని అయిన కోల్కత్తా రాజర్ హాట్ లో ఉన్న ప్రముఖ సినిమా షూటింగ్ స్టూడియోలో అగ్నిప్రమాదం జరిగింది. రాజర్ హాట్ లో డి ఆర్ ఆర్ స్టూడియోను చాలామంది ప్రజలు రాంబాబు గార్డెన్ అని పిలుస్తూ ఉంటారట. Fire breaks out at DRR Studio Rajarhat

- Advertisement -

అయితే ఈ గార్డెన్ లో చాలా సినిమాలు అలాగే సీరియల్ షూట్ అవుతాయట. అయితే సోమవారం ఉదయం 12 గంటల సమయంలో ఈ గార్డెన్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగిందని సమాచారం. రెండు మేకప్ వ్యాన్లు దగ్ధమయ్యాయి అని సమాచారం అందుతుంది. ఈ రెండు మేకప్ వ్యాన్లలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయట.

క్యాంటీన్ నుంచి మేకప్ వ్యాన్ వరకు మంటలు వ్యాపించాయి. ఈ నేపథ్యంలో అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది.. వెంటనే మంటలను ఆర్పి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక ఈ అగ్ని ప్రమాదంలో భారీ ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం. అంతేకాదు ఈ అగ్ని ప్రమాదం జరగడం వల్ల… అక్కడ భారీ ఆస్తి నష్టం జరిగిందని సమాచారం. ముఖ్యంగా సరిగమప లెజెండ్స్ షో కూడా వాయిదా పడిపోయిందట. ఇక ఈ సంఘటన గురించి ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు