Jio Cinema OTT : జియో సినిమా కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్… ఐపీఎల్ ను క్యాష్ చేసుకోవాలనే…

Jio Cinema OTT : ఓటిటి ప్లాట్ఫామ్ లన్ని మోస్ట్లీ సబ్స్క్రిప్షన్ ఉంటేనే కంటెంట్ చూసే అవకాశాన్ని కల్పిస్తున్నాయి. అయితే జియో సినిమా ఓటిటి ప్లాట్ఫామ్ మాత్రం ఎక్కువ శాతం కంటెంట్ ను ఉచితంగానే అందుబాటులో ఉంచింది. అందులో భాగంగానే ప్రస్తుతం జరుగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ మ్యాచ్ లను కూడా ఫ్రీగానే చూస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం నడుస్తున్న ఐపీఎల్ ఫీవర్ ను క్యాష్ చేసుకోవడానికి ఒక కొత్త ప్లాన్ తో సబ్స్క్రైబర్ల ముందుకు రావడానికి రెడీ అవుతున్నారు జియో సినిమా నిర్వాహకులు. అది కూడా యాడ్ ఫ్రీ ప్లాన్ అని సమాచారం.

జియో సినిమా కొత్త ప్లాన్ ఏంటంటే?

జియో సినిమాలో చాలా సినిమాలు, టీవీ కంటెంట్ ను ఉచితంగానే చూడొచ్చు. కొన్ని హాలీవుడ్ సినిమాలు తప్ప మొత్తం కంటెంట్ ను ఫ్రీగా చూసే అవకాశాన్ని కల్పిస్తున్నారు. ఈ క్రమంలోనే ఏప్రిల్ 25వ తేదీన కొత్త ప్లాన్ ను ప్రవేశ పెట్టడానికి జియో ఓటిటి ప్లాట్ఫామ్ రెడీ అవుతుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ అధికారికంగా ఓ ప్రోమోను రిలీజ్ చేశారు. యాడ్లు లేకుండా కంటెంట్ చూడాలి అనుకునే వారి కోసమే ఈ ప్లాన్ అని సమాచారం. మొత్తానికి ప్రస్తుతం నడుస్తున్న ఐపీఎల్ సీజన్ ను క్యాష్ చేసుకోవడానికి మాస్టర్ ప్లాన్ వేశారు.

కొత్త ప్లాన్ లాంచ్ ఎప్పుడంటే?

సాధారణంగా కంటే జియో సినిమాలో యాడ్స్ గోల కాస్త ఎక్కువగానే ఉంది. వీటితో తెగ చిరాకు పడే వారికి ఈ కొత్త ప్లాన్ ఉపశమనం ఇస్తుంది. ఉచితంగా యాడ్ తో సహా చూడాలనుకునేవారు అలాగే చూడొచ్చు. ఇప్పటికే జియో సావన్ మ్యూజిక్ ప్లాట్ఫామ్ విషయంలో రిలయన్స్ ఇదే ఫాలో అయ్యి సక్సెస్ అయ్యింది. ఇప్పుడు జియో సినిమా విషయంలో కూడా అదే స్ట్రాటజీని ఫాలో అవుతున్నారు.

- Advertisement -

ఇక ఈ యాడ్ ఫ్రీ సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరను ఏప్రిల్ 25న జియో సినిమా వెల్లడించనుంది. ప్రస్తుతానికి అయితే జియో సినిమాలో ఇంగ్లీష్, హిందీ, తెలుగు, మలయాళ, కన్నడ, తమిళ భాషలతో పాటు ఇతర భాషల్లోనూ ఐపీఎల్ 2024 మ్యాచ్ లు ఉచితంగా లైవ్ లో వస్తున్నాయి.

డిస్నితో జియో సినిమా ఒప్పందం…

గతంలో కూడా జియో సినిమా ఓటిటి జియో సినిమా ప్రీమియర్ పేరుతో ఓ ప్లాన్ తీసుకొచ్చింది. అందులో హెచ్బిఓ ప్రీమియం కంటెంట్ తో పాటు మరికొన్ని హాలీవుడ్ సినిమాలను అందుబాటులో ఉంచింది.. అయితే జియో ప్రీమియం ప్లాన్ ధర ఏడాదికి రూ. 999గా ఉంది. మరి కొత్త ప్లాన్ ఎలా ఉంటుందో చూడాలి. కాగా రిలయన్స్, డిస్నీ త్వరలోనే విలీనం కాబోతున్నాయి. దీనికి సంబంధించిన ఒప్పందం ఇప్పటికే పూర్తి అయ్యింది. ఈ ఒప్పందంలో భాగంగా రిలయన్స్ వియాకామ్ 18, స్టార్ ఇండియా టీవీ ఛానళ్లు ఒకటి కాబోతున్నాయి. అలాగే జియో సినిమా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటిటి ప్లాట్ ఫామ్ లో జాయింట్ వెంచర్ కింద ఉండబోతున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు