Anupama Parameswaran: ఆ హీరోతో రిలేషన్ షిప్ లో అనుపమ ?

Actress Anupama Parameswaran: టాలీవుడ్ ఇండస్ట్రీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇంత పెద్ద ఇండస్ట్రీలో హీరోయిన్లకు అస్సలు కొదవలేదు. తెలుగు హీరోయిన్లు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎక్కువగా ఉన్నప్పటికీ బయట నుంచి వచ్చిన హీరోయిన్లకు ఎక్కువగా ఛాన్సులు వస్తూ ఉంటాయి. అలా ఇప్పటికే ఇతర భాషల హీరోయిన్లు మన టాలీవుడ్ ఇండస్ట్రీని ఏలుతున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఎక్కడ చూసినా ఇతర భాషల హీరోయిన్లు మాత్రమే కనిపిస్తారు. బాలీవుడ్, కోలీవుడ్, మలయాళ ఇండస్ట్రీ నుంచి మన తెలుగు ఇండస్ట్రీలో పాతుకు పోతున్నారు.

 

దానికి తగ్గట్టుగానే దర్శక నిర్మాతలు వారికి మాత్రమే ఛాన్సులు ఎక్కువగా ఇస్తున్నారు. అంతేకాకుండా బయట నుంచి వచ్చిన హీరోయిన్లు ఎక్స్పోజింగ్ బాగా చేస్తారు. ఇది కూడా వాళ్లకు ప్లస్ అయింది. అదే తెలుగు హీరోయిన్లు మాత్రం అసలు ఎక్స్పోజింగ్ చేయరు. కాస్త పద్ధతిగా ఉంటారు. అందుకే ఇతర భాషల నుంచి వచ్చిన వారు… టాలీవుడ్ ఇండస్ట్రీ ఏలగలుగుతున్నారు. అలాంటి హీరోయిన్లలో అనుపమ పరమేశ్వరన్ కూడా ఉన్నారు.

- Advertisement -

హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ బ్యూటీకి ప్రత్యేక స్థానం ఉంది. కేరళ రాష్ట్రంలోని త్రిసూర్ జిల్లాకు చెందిన అనుపమ పరమేశ్వరన్… 2016 సంవత్సరం నుంచి… టాలీవుడ్ ఇండస్ట్రీలో మెరుస్తోంది. అయితే 2016 సంవత్సరంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది ఈ బ్యూటీ. క్యూట్ గా అలాగే చాలా చురుకుగా ఉండే అనుపమ పరమేశ్వరన్… తొలి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకుంది. ఆమెను నటించిన తొలి సినిమా శతమానం భవతి.

ఈ శతమానం భవతి సినిమాలో శర్వానంద్ హీరోగా చేయగా ఆయన సరసన హీరోయిన్గా అనుపమ పరమేశ్వరన్ మెరిసింది. 2016 సంవత్సరంలో సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ సినిమా రిలీజ్ అయి మంచి విజయాన్ని అందుకుందని చెప్పవచ్చు. ఇక ఆ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీలో అనుపమ పరమేశ్వరన్ కు మంచి చాన్స్ లే వచ్చాయి. దీంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి మార్కు సంపాదించుకుంది. ముఖ్యంగా 18 పేజీలు, కార్తికేయ 2 , రౌడీ బాయ్స్, హలో గురు ప్రేమకోసమే, లాంటి సినిమాలు చేసి బంపర్ హిట్ అందుకుంది.

ఇక ఇటీవల టిల్లు స్క్వేర్ సినిమాతో మరో అరుదైన హిట్ అందుకుంది అనుపమ పరమేశ్వరన్. టిల్లు స్క్వేర్ సినిమాలో సిద్దు జొన్నలగడ్డ హీరోగా చేసిన సంగతి తెలిసిందే. సిద్దు జొన్నలగడ్డ సరసన హీరోయిన్గా మెరిసింది అనుపమ పరమేశ్వరన్. ఈ సినిమాలో సిద్దు జొన్నలగడ్డ కామెడీ కంటే అనుపమ పరమేశ్వరన్ హాట్ సీన్స్ ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా హీరోకు అనుపమ పరమేశ్వరన్ పెట్టే కిస్సులు… యూత్ ను బాగా ఆకట్టుకుంటాయి. ఈ సినిమా కామెడీ తో పాటు అనుపమ పరమేశ్వరన్ హాట్ సీన్లతో సక్సెస్ అయింది.

ఇలాంటి నేపథ్యంలో అనుపమ పరమేశ్వరన్ గురించి ఆసక్తికర విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఓ యంగ్ హీరోతో అనుపమ పరమేశ్వరన్ చాలా క్లోజ్ గా ఉంటుందట. అతనితో ఎక్కడికి పడితే అక్కడికి వెళుతూ ఉందట. అయితే తనకు అతడు మంచి ఫ్రెండ్ అని… మా మధ్య ఎలాంటి సంబంధం లేదని అనుపమ తన స్నేహితులతో ఇప్పటికే చెప్పేసిందట. కానీ వారిద్దరి మధ్య ఎఫైర్ ఉందని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు