Liger: ఆ సినిమా యూనిట్ పై దీక్ష చేస్తున్న ఎగ్జిబిటర్స్

పూరి జగన్నాథ్ కు ఇంకా ఆ దరిద్రం వెంటాడుతూనే ఉంది. పూరి తీసిన సినిమాల్లో అత్యంత చెత్త సినిమాల్లో ఒకటిగా మిగిలిపోయిన లైగర్ గురించే ఈ టాపిక్ అంతా. అసలు విషయానికొస్తే పూరి జగన్నాథ్ డైరెక్టర్ గా స్వీయ నిర్మాణంలో బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ తో కలిసి నిర్మించిన భారీ చిత్రం “లైగర్”. ఈ మూవీ ని దాదాపు 100 కోట్లకి పైగా బడ్జెట్ తో తెరకెక్కించారు. ధర్మ ప్రొడక్షన్స్, పూరి కనెక్ట్స్ బ్యానర్ లో ఈ సినిమాను తెరకెక్కించారు. పైగా ఈ సినిమాలో ఒకప్పటి నటి ఛార్మీ కూడా నిర్మాణంలో భాగస్వామిగా ఉంది.

లైగర్ లో విజయ్ దేవరకొండ హీరోగా నటించగా అనన్య పాండే హీరోయిన్ గా నటించింది. పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కిన ఈ చిత్రం 2022 ఆగస్ట్ 25న భారీ అంచనాలతో విడుదలై ఎపిక్ డిజాస్టర్ అయింది. అయితే అప్పట్లో ఈ సినిమాకు మామూలు హంగామా చేయలేదు. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాలో మైక్ టైసన్ ని కూడా నటింపచేశారు. అదే ఈ సినిమాకి దెబ్బ కొట్టింది. ఇక ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా విజయ్ దేవరకొండ చేసిన వ్యాఖ్యలు ట్రోలింగ్ కు గురై సినిమా పతనానికి కారణమయ్యాయి. అయితే లైగర్ రిలీజ్ అయ్యి సంవత్సరం గడుస్తున్నా ఈ దరిద్రం మూవీ యూనిట్ ని ఇంకా వెంటాడుతుంది.

ఇక ఈ సినిమా డిజాస్టర్ అయ్యి డిస్ట్రిబ్యూటర్లను నిండా ముంచేసిన సంగతి తెలిసిందే. చిత్ర పంపిణిదారులు అప్పట్నుంచే గొడవ చేయగా పూరి వాళ్ళ సమస్యని పరిష్కరిస్తానని చెప్పి ఇంతవరకు ఏమి చేయలేదు. తాజాగా మరోసారి ఈ లైగర్ కి సంబంధించిన ఎక్సీబ్యూటర్లు మే 12 నుంచి లైగర్ సినిమా బాధితులకు న్యాయం చేయాలనీ తెలంగాణ లీజర్స్& ఎక్సీబ్యూటర్స్ కలిసి దీక్షలు చేస్తున్నారు. మరి ఇప్పుడైనా పూరి జగన్నాథ్ వారి చిత్ర బృందం కలిసి లైగర్ మూవీ కొన్న వారికి న్యాయం చేస్తారా లేదా అన్నది చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు