Niharika: “బెడ్ పై ఒకరు.. హెడ్ లో మరొకరు”.. మెగా డాటర్ డైలాగ్ పై దారుణంగా ట్రోల్స్..

తెలుగు రాష్ట్రాల సినీ ప్రేక్షకులకు మెగా డాటర్ కొణిదెల నిహారిక గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. మొదట యాంకర్ గా కెరియర్ స్టార్ట్ చేసిన నిహారిక తర్వాత హీరోయిన్ గా సినిమాలలోకి ఎంట్రీ ఇచ్చింది. ఒక మనసు సినిమా తో హీరోయిన్ గా మెగా ఫ్యామిలీ సపోర్ట్ తో కెరీర్ ప్రారంభించింది. కానీ ఆమె సినిమాలు పెద్దగా వర్కౌట్ కాలేదు. ఆ తరువాత అడపాదడపా వెబ్ సిరీస్ లో నటిస్తూ కెరీర్ కొనసాగించింది. ఇక పెళ్లి తర్వాత చాలాకాలం గ్యాప్ ఇచ్చిన నిహారిక మళ్లీ యాక్టింగ్ వైపు దృష్టి మళ్లించింది. ప్రస్తుతం ఆమె “డెడ్ పిక్సెల్స్” అనే వెబ్ సిరీస్ లో నటిస్తోంది.

ఆదిత్య మండల దర్శకత్వం వహించిన ఈ సిరీస్ మే 19 నుంచి హార్ట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు తాజాగా విడుదల చేసిన ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ లో ఆమె చెప్పిన డైలాగ్ అభిమానులకు షాక్ ఇచ్చింది. ఈ ట్రైలర్ లో నిహారిక చెప్పిన డైలాగ్ ఏంటంటే..”నాకు బెడ్ పై రోషన్ కావాలి, మైండ్ లో భార్గవ్ ఉన్నాడు” అనే డైలాగ్ ఈ సిరీస్ లో ఆమె కన్ఫ్యూజన్ స్టేట్ కు అద్దం పడుతుంది. ఈ డైలాగ్ చాలామందికి నచ్చలేదు. ఇలాంటి డైలాగులు అవసరమా..? సమాజానికి ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారంటూ నిహారికను ఏకీపడేస్తున్నారు నెటిజెన్లు. ఇలాంటి డబుల్ స్టాండర్డ్ డైలాగ్స్ వల్ల విజయం దక్కదని అభిప్రాయపడుతున్నారు.

For More Updates :

- Advertisement -

Check out Filmify for the latest Movie updates, Web Stories, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు