Dil Raju : రేట్లు పెరిగితే అంతా నన్నే అంటున్నారు

టికెట్ రేట్లు పెరిగితే నన్ను తిట్టుకుంటున్నారు అని.. పెద్ద సినిమాలకి థియేటర్లు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నాను అని అంతా నాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు అని దిల్ రాజు షాకింగ్ కామెంట్స్ చేశారు.

దిల్ రాజు మాట్లాడుతూ.. “నైజాంలో సింగిల్ స్క్రీన్స్ థియేటర్ల గురించి మాట్లాడేటప్పుడు 450 వరకు ఉన్నాయి ఇక్కడ. ఇందులో మా సంస్థకి 60 వున్నాయి. దిల్ రాజు నైజాం ఏరియాని మొత్తం కంట్రోల్ పెట్టుకున్నాడని చాలామంది అంటుంటారు. 60 థియేటర్లతో నేను కంట్రోల్ లో పెట్టుకునేది ఏముంటుంది. కానీ మిగతా వాళ్ళు మా మాట ఎందుకు వింటారంటే .. ఎవరైనా నాకు రూపాయి అడ్వాన్స్ గా ఇస్తే సినిమా అయిపోగానే రెండు మూడు వారాల్లో వారి ఖాతా సెటిల్ చేసి పంపిస్తాను.

మాకు ఇచ్చిన డబ్బు అంత సేఫ్ గా ఉంటుంది. ఎక్కువ సినిమాలు చేయడం వలన ఆటోమేటిక్ గా మాకు వాళ్ళు ప్రాధాన్యత ఇస్తారు. ఈ రెండు కారణాల వల్ల మేము నెంబర్ వన్ గా ఉన్నాం తప్పితే నేను ఏదో థియేటర్లని కంట్రోల్లోకి తీసుకుని కాదు. ఇక టికెట్ రేట్లు కూడా నా వల్ల పెరిగిపోయాయి అంటున్నారు. టికెట్ రేట్లు పెరిగినా మాకు భారీగా మిగిలిపోయేది ఏమీ ఉండదు. ఇప్పుడు బడ్జెట్లు వంటివి అన్నీ పెరిగిపోయాయి” అంటూ ఆయన చెప్పుకొచ్చారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు