Mahesh Babu : మహేష్ ను ఏడిపించిన సినిమా అదేనట..!

మహేష్ తొందరగా ఏ విషయాలను బయటపెట్టడు. అతనికి సిగ్గు ఎక్కువ అని కొంతమంది అంటారు, మరి కొంతమంది అతను జాగ్రత్త పరుడు తొందరగా మాటజారడు అంటుంటారు. అయితే తాజాగా అతను పీకాక్ మ్యాగజైన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ర్యాపిడ్ ఫైర్ ను నిర్వహించారు. ఇందులో తన ఇష్ట కష్టాల గురించి మహేష్ బయటపెట్టాడు. అతనికి ఎదురైన ప్రశ్నలు ఏంటి? అతను చెప్పిన ఇంట్రెస్టింగ్ సమాధానాలు ఏంటి అంటే..

‘ఇష్టమైన అలాగే కోరుకునే ముద్దు పేరు?… నాని అని, బాగా భయపడే సందర్భాలు? దర్శకుల కోరుకున్న ఔట్పుట్ ఇవ్వలేనేమో అనే భయం ఉంటుందని, నేను చాలా ఫన్నీ పర్సన్. మా పిల్లలు, భార్యకు మాత్రమే ఆ విషయం తెలుసని’ మహేష్ చెప్పుకొచ్చాడు.

అంతేకాకుండా.. మీరు చూసిన సినిమాల్లో ఏడుపు తెప్పించిన సినిమా ఏది అని అడుగగా..’ ‘లయన్ కింగ్’ అని… దాన్ని చూస్తే చాలు కన్నీళ్లు ఆగవని’ మహేష్ తెలిపాడు. అలాగే మీరు నటించిన సినిమాల్లో… దర్శకుడిగా మారి తీయాల్సి వస్తే ఏ సినిమాని తీస్తారు అనే ప్రశ్నకి ‘ఒక్కడు’ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తానని మహేష్ చెప్పుకొచ్చాడు. ఇక అతనికి బాగా ఇష్టమైన సినిమా కృష్ణ గారు నటించిన ‘అల్లూరి సీతారామరాజు’ అని కూడా చెప్పుకొచ్చాడు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు