Koratala Siva : మాట తప్పిన కొరటాల…!

ఎన్టీఆర్ తో తన నెక్స్ట్ సినిమాని ఖరారు చేసుకున్నాడు దర్శకుడు కొరటాల శివ. నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో మిక్కిలినేని సుధాకర్, కె.హరికృష్ణలు కలిసి ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. ‘ఆచార్య’ చిత్రం వల్ల ఆర్థికంగా చాలా నష్టపోయాడు కొరటాల. దిల్ రాజుని కాదని నైజాం ఏరియాకి వరంగల్ శ్రీనుకి రైట్స్ ఇప్పించి.. భారీ నష్టాలు తీర్చే తలనొప్పిని మీదేసుకున్నాడు.

ఈ విషయంలో ‘యువ సుధా ఆర్ట్స్’ అధినేతలు కొరటాల శివకి చాలా సాయం చేశారు. ఈ విషయాన్ని పక్కన పెట్టేస్తే మోషన్ పోస్టర్ తోనే సినిమాకి సూపర్ హిట్ కళని చేకూర్చాడు కొరటాల. ఈ సినిమాతో ఆయన బౌన్స్ బ్యాక్ అవ్వడమే కాకుండా రాజమౌళి హీరోల మిత్ ను తిరగరాసే పనిలో కూడా పడ్డాడు అని చెప్పాలి.

ఇదిలా ఉండగా.. ఓ విషయంలో మాత్రం కొరటాల మాట తప్పాడు అనే చెప్పాలి. అదేంటి అంటే.. కొరటాల తెరకెక్కించిన సినిమాల్లో ఒక్క ‘ఆచార్య’ కి తప్ప మిగిలిన అన్ని సినిమాలకి దేవి శ్రీ ప్రసాద్ ను సంగీత దర్శకుడిగా ఎంపిక చేసుకున్నాడు కొరటాల. అయితే ఎన్టీఆర్ 30 వ చిత్రానికి మాత్రం తమిళ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ ను ఎంపిక చేసుకున్నాడు.

- Advertisement -

ఈ విషయంలో ఎన్టీఆర్ ఒత్తిడి మేరకు చేయక తప్పలేదు. ‘ఈ ఒక్క సినిమాకి తప్ప.. మిగిలిన అన్ని సినిమాలకి నాకు నువ్వే కావాలి’ అని కొరటాల గతంలో చెప్పుకొచ్చాడు. కానీ ఇప్పుడు హీరో బలవంతం మీద మాటతప్పుతున్నాడు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు