మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కు ఓ అలవాటు ఉంది. తన సినిమాల్లో సీనియర్ హీరోయిన్లను తీసుకొచ్చి ఏదో ఒక పాత్రకి వాళ్ళని అతికించి క్రేజ్ సంపాదించాలి అనుకుంటాడు. ఈ విషయంలో త్రివిక్రమ్ కంటే, కొరటాల శివ, బోయపాటి శ్రీను రెండు ఆకులు ఎక్కువే చదివారు అని చెప్పాలి. అయితే త్రివిక్రమ్ స్పెషలిటీ వేరు.
అలా తీసుకొచ్చిన సీనియర్ హీరోయిన్లని వాళ్ళ చేతే డబ్బింగ్ కూడా చెప్పించేసి మరింత హైలెట్ చెయ్యాలి అని చూస్తుంటాడు. సరే ఇక అసలు విషయానికి వచ్చేద్దాం.. త్రివిక్రమ్ ‘కె.జి.ఎఫ్ చాప్టర్ 2’ నటి పై మనసు పారేసుకున్నాడట. అంటే వేరే విధంగా అనుకోకండి. ఆ సినిమాలో ఓ నటిని తన సినిమాలోకి తీసుకోవాలి అనేది అతని ఉద్దేశం అంతే..!
ఆ నటి మరెవరో కాదు రవీనా టాండన్. ‘కె.జి.ఎఫ్ చాప్టర్ 2’ లో రవీనా ప్రధాన మంత్రి పాత్రలో చాలా పవర్ ఫుల్ గా నటించింది. సినిమాకి ఈమె పాత్ర చాలా కీలకం. రాఖీ బాయ్ ను చంపించడానికి సైనిక దళాలను తెప్పించి చంపించేస్తుంది. ఈమె పాత్రని దర్శకుడు చాలా పవర్ ఫుల్ గా డిజైన్ చేశాడు. ఇప్పుడు మహేష్ తో త్రివిక్రమ్ చేయబోయే సినిమాలో రవీనా టాండన్ ను ఎంపిక చేసుకోవాలని ప్రయత్నాలు మొదలుపెట్టాడు. అయితే ఆమె అంత ఇంట్రెస్ట్ చూపించడం లేదు అని వినికిడి.