Agent : సురేందర్ రెడ్డి పై ఫైర్ అవుతున్న అఖిల్..!

అక్కినేని మూడో తరం హీరో అయిన అఖిల్ మొత్తానికి ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ చిత్రంతో డీసెంట్ హిట్ అందుకుని మిడ్ రేంజ్ హీరోల లిస్ట్ ప్లేస్ ను పదిలం చేసుకున్నాడు. ఇప్పుడు అతను టాప్ హీరో రేంజ్ కు చేరుకోవాలంటే రెండు, మూడు మంచి బ్లాక్ బస్టర్లు పడాలి. అర్జెంట్ గా అయితే ఓ బ్లాక్ బస్టర్ పడాలి.

సురేందర్ రెడ్డి వంటి క్లాస్, మాస్ ఫాలోయింగ్ ఉన్న దర్శకుడు దొరికాడు. మమ్ముట్టి వంటి స్టార్ ను కూడా ఈ చిత్రాల్లో ఓ కీలక పాత్రకి ఎంపిక చేసుకున్నారు. ఖర్చుకి ఏమాత్రం వెనుకాడని అనిల్ సుంకర నిర్మాత. కాబట్టి ఓ మంచి సినిమా బయటకి వస్తుంది అని అఖిల్ అభిమానులు, అక్కినేని అభిమానులు నమ్ముతున్నారు.

అయితే కొద్దిరోజుల నుండీ అఖిల్.. సురేందర్ రెడ్డి ల మధ్య కోల్డ్ వార్ జరుగుతున్నట్టు వినికిడి. దర్శకుడు సురేందర్ రెడ్డి కోరుకునే హావభావాలు అఖిల్ పలికించలేకపోతున్నాడు. దాంతో అతను టేక్ ల మీద టేక్ లు తీసుకుంటూ వస్తున్నాడట. అలా కొన్ని రోజులు చూసిన అఖిల్ సహనం కోల్పోయి సురేందర్ రెడ్డి పై చూపించడం మొదలుపెట్టాడట.

- Advertisement -

ప్యాకప్ టైం అయిపోయినా ఎన్ని టేకులు చేయాలి అంటూ సురేందర్ రెడ్డి పై ఫైర్ అవుతున్నట్టు వినికిడి. తప్పదు అఖిల్ నీకు మంచి పేరు రావాలి అన్నా సినిమా బాగా ఆడాలి అన్నా.. కొంచెం దర్శకుడు చెప్పింది వినాలి అంటూ నిర్మాత అనిల్ సుంకర అఖిల్ కు సర్ది చెప్పినట్లు తెలుస్తుంది.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు