దివి ఈ పేరుకు పరిచయం అక్కర్లేదు. బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన దివి తన అందచందాలతో అభిమానులను సంపాదించుకుంది. ఫైనల్స్ లో మెగా స్టార్ చిరంజీవి దృష్టినే ఆకర్షించి సినిమాలో ఛాన్స్ దక్కించుకుంది. ప్రస్తుతం దివి సినిమాలు, టీవీ షోలతో ఫుల్ బిజీగా ఉంది. అయితే బిగ్ బాస్ లోకి అడగుపెట్టక ముందే దివి మహర్షి సినిమాలో నటించింది. కానీ అది చాలా అంటే చాలా చిన్న రోల్. అసలు దివి ఆ సినిమాలో ఉన్నట్టు కూడా ఎవరూ గుర్తపట్టరు. బిగ్ బాస్ లో అడుగుపెట్టిన తరవాతనే దివి మహర్షిలో మెరిసిన వీడియో నెట్టింట వైరల్ అయ్యింది. ఇక బిగ్ బాస్ లో అందరితో కలివిడిగా ఉంటూ అభిమానులను బుట్టలో వేసుకుంది. మరోవైపు ఈ బ్యూటీ అందానికి జూనియర్ శ్రీదేవి అంటూ కూడా ప్రశంసలు అందాయి.
ఇక బిగ్ బాస్ లో క్రేజ్ వచ్చిన తరవాత పుష్ప సినిమాలో న్యూస్ రీడర్గా, గాడ్ ఫాదర్ సినిమాలో ముఖ్యపాత్రలో నటించింది. అయితే ఇప్పటి వరకూ ఈ బ్యూటీకి సరిపోయే సినిమా ఛాన్స్ మాత్రం రాలేదు. కానీ సోషల్ మీడియాలో ఈ అమ్మడికి లక్షల్లో అభిమానులు ఉన్నారు. ఇక అభిమానులు నిరాశచెందకుండా దివి కూడా ప్రతిరోజూ గ్లామర్ ఫోటోలతో కిక్కెస్తూ ఉంటుంది.
ఈ నేపథ్యంలో తాజాగా యోగా చేస్తూ దివి నెట్టింట ఫోటోలను షేర్ చేసింది. ఈ ఫోటోలో లో దుస్తులతో కుర్రాళ్ల మతులు పోగోడుతుంది. టైట్ డ్రెస్ లో దివి అందాలు చూసి కుర్రాళ్ళు ఫిదా అవుతున్నారు. దివి మొత్తం రెండు ఫోటోలు షేర్ చేయగా ఓ ఫోటోలో శ్రద్దగా యోగా చేస్తుండగా మరో ఫోటోలో హాట్ ఫోటోజులో నీళ్లు తాగుతోంది. ఇక ఈ ఫోటోకు ఓ అభిమాని నిన్ను చూడగానే చిట్టిగుండె గట్టిగానే కొట్టుకున్నదే అంటూ అంటూ తన ఫీలింగ్ ను పాట రూపంలో చెప్పాడు. మిగితా నెటిజన్లు కూడా తమ స్టైల్ లో కామెంట్స్ పెట్టారు.
Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.