Sreeleela : ఈ అమ్మడు అప్పుడే బోర్ కొట్టేసిందా?

సెలబ్రిటీలు బయట ఎంత తక్కువగా కనిపిస్తే అంత ఎక్కువ అట్రాక్టివ్ గా ఉంటారు. అయితే ఏదో ఒక రకంగా తరచుగా కనిపిస్తూ, జనాలకు అందుబాటులో ఉంటే వారిపై మొహం మొత్తేస్తుంది. తాజాగా మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్ శ్రీలీల విషయంలో కూడా అలాగే జరిగినట్టుగా అనిపిస్తోంది.

‘పెళ్లి సందడి’ మూవీతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ప్రస్తుతం చేతుల్లో చాలా వరకు సినిమాలు పెట్టుకుని టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ ప్లేస్ ను ఆక్రమించే పనిలో పడింది. కానీ ఆమె కల నెరవేరేలా కనిపించడం లేదు. “ధమాకా”తో బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్న శ్రీలీల ఆ తర్వాత “భగవంత్ కేసరి” మూవీతో మరోసారి సాలిడ్ హిట్ కొట్టింది. అయితే అంతకు ముందు “స్కంద”, “భగవంత్ కేసరి” మూవీ తర్వాత “ఆదికేశవ”తో ఈ అమ్మడి ఖాతాలో డిజాస్టర్లు పడిపోయాయి. ప్రస్తుతం ఆమె చేతిలో “గుంటూరు కారం”, “ఉస్తాద్ భగత్ సింగ్” లాంటి భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. అంతేకాకుండా ప్రస్తుతం టాలీవుడ్ లో హీరోయిన్ల కొరత ఉండడంతో చాలామంది స్టార్ హీరోలతో పాటు యంగ్ హీరోలు కూడా శ్రీలీలనే హీరోయిన్ గా తీసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు.

ప్రస్తుతం నితిన్ హీరోగా నటిస్తున్న “ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్” అనే మూవీతో ఈ బ్యూటీ బిజీగా ఉంది. డిసెంబర్ 8న రిలీజ్ కానున్న ఈ మూవీ ప్రమోషన్స్ ను ఇంకా శ్రీలీల స్టార్ట్ చేయనేలేదు. అయితే నితిన్ చేయబోయే తర్వాత సినిమాలకు కూడా నటిస్తోంది. నిజానికి “ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్” మూవీలో ఆమె పాత్రకు పెద్దగా ప్రాధాన్యత ఉన్నట్టుగా కనిపించడం. కానీ నితిన్ నెక్స్ట్ చేయబోయే రెండు సినిమాలకు కూడా శ్రీలీలే హీరోయిన్ గ సైన్ చేసేసింది.

- Advertisement -

అయితే ఈమెను వెండితెరపై వెంట వెంటనే చూసి చూసి ప్రేక్షకులు బోర్ ఫీల్ అవుతున్నారని అనుకుంటున్నారో ఏమో… కొంతమంది దర్శక నిర్మాతలు మాత్రం శ్రీలీలను తమ సినిమాలో తీసుకోవడానికి వెనకాడుతున్నారు. తాజాగా రవితేజ, హరిష్ శంకర్ కాంబోలో రాబోతున్న మూవీకి శ్రీలీలను మాత్రం వద్దని చెప్పేసారట నిర్మాతలు. ఇదంతా చూస్తుంటే శ్రీలీల అప్పుడే టాలీవుడ్ కు బోర్ కొట్టేసిందా?! అని అనిపిస్తోంది. మరి ఈ క్లిష్టమైన పరిస్థితిని యంగ్ బ్యూటీ శ్రీలీల ఎలా ఎదుర్కొంటుందో చూడాలి. లేదంటే పీక్స్ లో ఉన్న ఈ బ్యూటీ కెరీర్ కాస్తా పాతాళంలోకి పడిపోయే అవకాశం ఉంది. మరి శ్రీలీల ఇప్పటికైనా తాను సెలెక్టివ్ గా సినిమాలు చేసుకుంటే బెటర్.

Check out Filmify for the latest Movie updates, New Movie Reviews, Ratings, and all the Entertainment News in Tollywood & Bollywood and all other Film Industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు