Thandel : నాగ చైతన్య కంటే సాయి పల్లవికే ఎక్కువ రెమ్యూనరేషనా?

టాలీవుడ్ కు చాలా మంది హీరోయిన్లు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. కానీ కొంతమంది మాత్రమే తమ అందం, అభినయంతో ఎల్లకాలం గుర్తుండిపోయే పాత్రలు చేస్తూ, ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ను సొంతం చేసుకుంటారు. ప్రస్తుత తరంలో అలాంటి లక్షణాలు ఉన్న హీరోయిన్ అన్నా, ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన నటి అన్నా సాయి పల్లవి టక్కున గుర్తొస్తుంది. ఈ అమ్మడు గ్లామర్ పై కాన్సన్ట్రేట్ చేయకుండా తన అద్భుతమైన డాన్స్ స్కిల్స్ తో పాటు అందం, అభినయంతో అందరినీ ఆకట్టుకుంటూ ఉంటుంది. స్కిన్ షో చేయకుండానే యూత్ ను మాయ చేస్తూ ఉంటుంది.

ఈటీవీలో ప్రసారమయ్యే ఢీ అనే పాపులర్ డాన్స్ షోలో ఒక కంటెస్టెంట్ గా పాల్గొని, ఇప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది సాయి పల్లవి. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన సాఫ్ట్ లవ్ స్టోరీ “ఫిదా” మూవీతో ఆమె టాలీవుడ్ కు హీరోయిన్ గా పరిచయమైంది. ఫస్ట్ మూవీతోనే సాయి పల్లవికి ఊహించని రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కింది. దీంతో ఈ బ్యూటీ ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. ఆ సినిమా అంత పెద్ద హిట్ అవ్వడానికి ప్రత్యేకమైన కారణం సాయి పల్లవే. అనంతరం ఈ బ్యూటీ తెలుగు, తమిళ భాషల్లో బిజీ అయిపోయింది. అయితే ఆఫర్లు వెల్లువలా వచ్చి పడుతున్నాయి కదా అని ఏది పడితే అది చేయకుండా, సెలెక్టివ్ గా సినిమాలు చేసుకుంటూ ఎన్నో సూపర్ హిట్స్ అందుకుంది.

అలా తన నటన డాన్స్ తో కోట్లాది మంది అభిమానుల్ని సొంతం చేసుకుంది సాయి పల్లవి. ఈ బ్యూటీని లేడీ పవర్ స్టార్ అని ముద్దుగా పిలుచుకుంటూ ఉంటారు ఆమె అభిమానులు. ఇక ఆ పేరుకు తగ్గట్టుగానే తాజాగా సాయి పల్లవి అందుకుంటున్న రెమ్యూనరేషన్ హాట్ టాపిక్ గా మారింది. అక్కినేని నాగచైతన్య హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో “తండేల్” అనే మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. గీతా ఆర్ట్స్ తెరకెక్కిస్తున్న ఈ మూవీలో సాయి పల్లవి ఫిమేల్ లీడ్ రోల్ పోషించనుంది. శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకుంటున్న ఈ మూవీ ఫ్యాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కనుంది. ఈ సినిమాలో నేచురల్ బ్యూటీ సాయి పల్లవి ఏకంగా ఏడు కోట్ల రేమినరేషన్ అందుకుంటుందట. అడ్వాన్స్ గా ఇప్పటికే ఆమెకు మూడు కోట్లను ముట్ట చెప్పారట ప్రొడ్యూసర్ అల్లు అరవింద్. కానీ ఈ సినిమాకి హీరోగా చేస్తున్న నాగచైతన్య కేవలం ఐదు కోట్ల రూపాయలు మాత్రమే పారితోషికంగా తీసుకుంటున్నట్టు సమాచారం. ప్రస్తుతం ఇండస్ట్రీలో వీళ్ళిద్దరి గురించే చర్చ నడుస్తోంది. ఇక గతంలో వీళ్ళిద్దరి కాంబినేషన్ లో “లవ్ స్టోరీ” అనే బ్లాక్ బస్టర్ మూవీ వచ్చిన విషయం తెలిసిందే. దీంతో “తండేల్ ” మూవీ కూడా అదే రేంజ్ లో హిట్ అవుతుందని అనుకుంటున్నారు

- Advertisement -

Check out Filmify for the latest Movie updates, New Movie Reviews, Ratings, and all the Entertainment News in Tollywood & Bollywood and all other Film Industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు