Ramabanam: సమంతకి కౌంటర్ వేసిన డింపుల్ హయతి

డింపుల్ హయతి.. అని హీరోయిన్ పేరు చెప్పగానే ఎవరైనా బాలీవుడ్ హీరోయినో, లేక తమిళ్ యాక్టరో అనుకుంటారు. కానీ డింపుల్ హయతి పక్క తెలుగమ్మాయి. ఆంధ్ర ప్రదేశ్ లోని విజయవాడలో పుట్టింది ఈ బ్యూటీ. ఆ తరువాత ఫ్యామిలీ హైదరాబాద్ కి షిఫ్ట్ అవడంతో ఇక్కడే పెరిగింది. మోడల్ గా కెరీర్ మొదలు పెట్టి ప్రస్తుతం తెలుగు, తమిళ్, హిందీ సినిమాలలో హీరోయిన్ గా నటిస్తోంది.

గల్ఫ్ అనే సినిమాతో తెలుగు తెరకి పరిచయమైన డింపుల్ హయతి. ఆ సినిమా ఎక్కువగా పాపులర్ అవ్వకపోవడంతో పెద్దగా అవకాశాలు రాలేదు. తెలుగులో అవకాశాలు రానప్పుడు పక్క ఇండస్ట్రీలలో వైపు చూసే అందరి హీరోయిన్స్ లాగే డింపుల్ కూడా తమిళ్ ఇండస్ట్రీ వైపు వెళ్ళింది. తమన్నా, ప్రభుదేవా జంటగా నటించిన హర్రర్ సినిమా అభినేత్రి లో ప్రధాన పాత్రలో కనిపించింది. ఎ.యల్ విజయ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులని ఒక మోస్తరుగా అలరించింది. అయితే ఈ సినిమాలో డింపుల్ అందం, అభినయం చుసిన హరీష్ శంకర్ వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన గద్దలకొండ గణేష్ సినిమాలో ఐటెం సాంగ్ కి డింపుల్ హయతిని కాస్ట్ చేసారు. ఈ సినిమా సూపర్ హిట్ అవడంతో డింపుల్ హయతికి తెలుగులో మంచి గుర్తింపు వచ్చింది.ఆ తరువాత రమేష్ వర్మ దర్శకత్వంలో, రవితేజ హీరోగా వచ్చిన ఖిలాడీ సినిమాలో డింపుల్ మెయిన్ హీరోయిన్ గా చేసింది.

అయితే ప్రస్తుతం డింపుల్ హయతి, గోపిచంద్ హీరోగా వచ్చిన రామబాణం సినిమాలో నటించింది. ఈ సినిమాకి శ్రీవాస్ దర్శకత్వం వహించారు. లక్ష్యం, లౌక్యం సినిమాలతో హిట్ ట్రాక్ పై ఉన్న వీళ్లా కాంబినేషన్ రామబాణం సినిమాతో హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్నారు. అన్ని చోట్ల సినిమాని ప్రమోట్ చేస్తూ జనాల్లోకి తీసుకెళ్తున్నారు. అయితే ఇటీవలనే రామబాణం సినిమా ప్రమోషన్స్ భాగంగా స్టూడెంట్స్ మీట్ లో పాల్గొన్న డింపుల్ హయతిని ఒక స్టూడెంట్ “మేడం మీకు గుడి కడదామనుకుంటున్న బ్రిక్స్ తో కట్టాలా, లేక పాలరాతితో కట్టాలా అని సరదాగా అడిగాడు.. డింపుల్ ఆ ప్రశ్నకి సమాధానంగా ” బంగారంతో కడితే చెప్పండి” అని సరదాగా జవాబు ఇచ్చింది. అయితే ఇటీవలనే సమంత ఫ్యాన్ ఒకతను సమంతకి గుడి కట్టాడు. దానికి కౌంటర్ గానే డింపుల్ హయతి ఇలా మాట్లాడిందా అంటూ సోషల్ మీడియాలో చర్చలు జరుపుతున్నారు సామ్ ఫ్యాన్స్.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు