Allu Arjun: బన్నీ సినిమాలో మెగాడాటర్ – బంపర్ ఆఫర్..!

మెగాడాటర్ నిహారిక కొణిదెల గత కొంత కాలంగా తరచూ వార్తల్లో నిలుస్తూ వస్తోంది. నిహారిక, చైతన్యలు విడాకులు తీసుకోబోతున్నారు అన్న రూమర్స్ ఇందుకు కారణం. ఆ రూమర్స్ పై ఎలాంటి ప్రకటన చేయని నిహారిక తన పని తాను చేసుకుంటూ పోతోంది. ఇటీవలే సొంత నిర్మాణ సంస్థ స్థాపించిన నిహారిక డెడ్ పిక్సెల్స్ అనే వెబ్ సిరీస్ ని కూడా నిర్మించింది. అవకాశం దొరికినప్పుడల్లా సినిమాల్లో నటిస్తూ తనలోని నటిని సంతృప్తి పరుచుకుంటున్న నిహారిక మరో క్రేజీ ప్రాజెక్ట్ లో నటించే ఛాన్స్ అందుకుందని సమాచారం అందుతోంది. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ డైరెక్షన్లో పుష్ప సినిమాకి సీక్వెల్ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఆ సినిమాలో ఒక కీలక పాత్ర కోసం నిహారికకు అవకాశం ఇచ్చినట్టు సమాచారం అందుతోంది.

అల్లు అర్జున్ సరసన రష్మిక హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో గిరిజన అమ్మాయి పాత్ర కీలకంగా ఉంటుందని, ఆ పాత్ర కోసం మొదట్లో సాయిపల్లవిని సంప్రదించగా వర్కౌట్ అవ్వకపోవటంతో ఇప్పుడు నిహారికకు ఎంచుకున్నారని అంటున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను ఈ ఏడాది డిసెంబర్ లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది సినిమా యూనిట్.

పుష్ప 2లో నిహారిక క్యారెక్టర్ పై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు కానీ, ఈ వార్త గనక నిజం అయితే సినిమా కి మరింత హైప్ క్రియేట్ అయ్యే ఛాన్స్ ఉంది. భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమా పాన్ ఇండియా వైడ్ విడుదల అవుతుంది కాబట్టి ఈ సినిమాలో నటిస్తే నిహారికకు కూడా పాన్ ఇండియా ఎక్స్పోజర్ వచ్చే ఛాన్స్ ఉంది. ఈ వార్త విన్న మెగా ఫ్యాన్స్  హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరి, ఈ వార్తలు నిజామా కాదా తెలియాలంటే అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేంత వరకు వేచి చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు