Chiranjeevi: పబ్లిక్ లో సుమా పరువు తీసిన మెగాస్టార్. !

Chiranjeevi.. యాంకర్ సుమ కనకాల తన ఖరీదైన బట్టలు కొట్టేసిందంటూ పబ్లిక్ లో చెప్పి చిరంజీవి ఆమె పరువు తీశారు.. ఒక ప్రైవేట్ ఈవెంట్ లో జరిగిన ఈ ఘటనలో సుమా తెల్ల ముఖం వేసుకుంది..మరి అసలు విషయం ఏమిటో చిరంజీవి ఎందుకలా అన్నారో ఇప్పుడు చూద్దాం.. స్టార్ యాంకర్ గా దశాబ్దాల ప్రస్థానం కలది సుమ.. కొన్ని ఏళ్లుగా బుల్లితెరను ఏలుతున్న ఈమె మలయాళీ అమ్మాయి.. తండ్రి ఉద్యోగారీత్య హైదరాబాదులో స్థిరపడ్డారు.. నటి కావాలనే ప్రయత్నాలు చేసి సక్సెస్ కాకపోవడంతో యాంకర్ గా మారి సక్సెస్ అయింది ఈ ముద్దుగుమ్మ..

సుమకి చుక్కలు చూపించిన చిరంజీవి..
సాధారణంగా యాంకర్ గా సుమా ఉందంటే స్టార్లు కూడా కంగారు పడతారు.. అలాంటి సుమకి మెగాస్టార్ చిరంజీవి చుక్కలు చూపించారు.. సోషల్ స్టార్స్ కోసం హైదరాబాదులో ఒక కార్యక్రమం నిర్వహించగా.. అందులో చిరంజీవి, విజయ్ దేవరకొండ వంటి స్టార్స్ ఈవెంట్ కి హాజరయ్యారు.. ఇక విజయ్ దేవరకొండ చిరంజీవిని ఇంటర్వ్యూ కూడా చేశారు.. చిరంజీవి యొక్క నటనా ప్రస్థానం గురించి అనేక విషయాలను తెలుసుకున్నారు.. ఇక ఈ కార్యక్రమానికి సుమ యాంకర్ గా వ్యవహరించింది.. ఈ క్రమంలోనే చిరంజీవి సుమ మధ్య ఒక సరదా సంభాషణ చోటుచేసుకుంది. సుమను దగ్గరకు పిలిచిన చిరంజీవి.. తన భార్య సురేఖకు కాల్ చేశారు.. దాంతో సుమ నన్ను లంచ్ కి ఇంటికి పిలవడానికి కాబోలు అని అన్నారు.. కానీ చిరంజీవి తన భార్య సురేఖతో నా గ్రే కలర్ కోట్, బ్లాక్ పాయింట్ పోయిందని బాధపడ్డావు కదా.. అది దొరికేసింది.. సుమ మన ఇంటికి ఎప్పుడు వచ్చిందో కానీ చేతివాటం చూపించింది.. ఆ డ్రెస్ ఇప్పుడు సుమా వద్దే ఉంది. తీసుకొచ్చేస్తాను ..కంగారు పడకు అని అన్నారు చిరంజీవి.. దానికి సుమ మీరు ఇవ్వాలి.. నేను వేసుకోవాలి అంటూ కామెంట్ చేసింది.. లేదు కాస్ట్లీ డ్రెస్ నా కష్టార్జితం అని చిరంజీవి అన్నారు.. దీంతో సుమ తన డ్రస్ దొంగతనం చేసిందని చిరంజీవి వేదిక మీద చెప్పడంతో తెల్ల ముఖం వేసింది. ఇక సుమ చిరంజీవి పై సరదాగా వేసిన పంచులకు ఆడియన్స్ తెగ నవ్వుకున్నారు.. మొత్తానికైతే ఆ సందర్భం అభిమానులలో కూడా ఆనందాన్ని కలిగించిందని చెప్పవచ్చు..

చిరంజీవి సినిమాలు..
ప్రస్తుతం చిరంజీవి వరుస సినిమాలతో బిజీగా దూసుకుపోతున్న విషయం తెలిసిందే.. ఇక తాజాగా బింబిసారా సినిమాతో భారీ విషయాన్ని సొంతం చేసుకున్న వశిష్ట మల్లిడి దర్శకత్వంలో విశ్వంభర అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు చిరంజీవి.. ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 10వ తేదీన రిలీజ్ చేస్తామంటూ ముందే రిలీజ్ డేట్ ను లాక్ చేశారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, లింక్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.. ఈ సినిమా పైనే ఎన్నో అంచనాలను పెట్టుకున్న చిరంజీవి ఈ సినిమాతో ఎలాంటి విజయాన్ని అందుకుంటారో అనేది ఇప్పుడు అభిమానులలో కూడా ఆసక్తికరంగా మారింది. మరి ఈ సినిమాతో చిరంజీవి తన పూర్వ వైభవాన్ని పొందుతారేమో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు