Tillu Square : టాలీవుడ్ స్ట్రాంగ్ కం బ్యాక్.. ఇండియాలో నెంబర్ వన్ గా టిల్లుగాడు..

Tillu Square : టాలీవుడ్ లో ఈ ఇయర్ బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్దగా సందడి చేసిన సినిమాలు రీసెంట్ గా ఒక్కటి కూడా లేవని చెప్పాలి. అయితే 2024 ఆరంభంలోనే సంక్రాంతికి ‘హనుమాన్’ వంటి బ్లాక్ బస్టర్ సినిమాతో కళ్ళు చెదిరే హిట్ తో, భారీ కలెక్షన్స్ తో దుమ్ము లేపిన టాలీవుడ్ ఇండస్ట్రీ, ఒక్క తెలుగులోనే కాదు ఏకంగా ఇండియా మొత్తం మీద ఈ ఇయర్ లో హైయెస్ట్ కలెక్షన్స్ ని మొదటి నెలలో అందుకున్న ఇండస్ట్రీగా సంచలనం సృష్టించింది. దాదాపు ఇండియా లో అయితే ఇప్పటికి హనుమాన్ సినిమానే హైయెస్ట్ గ్రాసర్ గా కొనసాగుతుంది. కానీ తర్వాత సీన్ మొత్తం మారిపోయింది. ఆ తర్వాత ఫిబ్రవరి నుండి ఇప్పటివరకూ రిలీజ్ అయిన తెలుగు సినిమాల్లో ఒక్కదానికి కూడా నిఖార్సైన హిట్టు దక్కలేదు. భారీ అంచనాలు పెట్టుకున్న బడా సినిమాలు తుస్సుమనగా, చిన్న సినిమాలు హిట్టయినా అవి ఓ మోస్తరు విజయాలే. అది కూడా తెలుగు రాష్ట్రాలకి మాత్రమే పరిమితమయ్యాయి.

ఇతర ఇండస్ట్రీలో వరుస బ్లాక్ బస్టర్స్..

అయితే తెలుగులో అంచనాలను అందుకున్న సినిమాలు పెద్దగా రాక పోవడంతో ఆడియన్స్ కూడా డబ్బింగ్ సినిమాలపై పడ్డారు. ఇక ఇదే సమయంలో ఇతర సినిమా ఇండస్ట్రీలు, ముఖ్యంగా బాలీవుడ్ అలాగే మలయాళ ఇండస్ట్రీలు ఫుల్ జోరు చూపించగా టాలీవుడ్ ఇండస్ట్రీ మాత్రం సైలెంట్ అయింది. మలయాళం లో ప్రేమలు, మంజుమ్మేల్ బాయ్స్ ఇండస్ట్రీ రికార్డులని తిరగరాస్తూ, ఇప్పుడు తెలుగులో కూడా దుమ్ములేపుతుండగా, తెలుగులో మాత్రం ఒక్క సరైన సినిమా లేకపోగా, ఆల్ మోస్ట్ 2 నెలలు కొనసాగిన ఈ ట్రెండ్ ఎట్టకేలకు మార్చ్ లాస్ట్ వీకెండ్ లో బ్రేక్ అయ్యింది. టాలీవుడ్ లో లేటెస్ట్ గా రిలీజ్ అయిన సిద్ధూ జొన్నలగడ్డ నటించిన లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ టిల్లు స్క్వేర్ ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో వీకెండ్ లో అల్టిమేట్ గా ట్రెండ్ అయ్యి, ఓవరాల్ గా ఈ వీకెండ్ లో ఇండియన్ మూవీస్ పరంగా బుక్ మై షోలో హైయెస్ట్ టికెట్ సేల్స్ ను సొంతం చేసుకుని దుమ్ము లేపింది.

ఇండియాలో నెంబర్ వన్..

సిద్ధూ జొన్నలగడ్డ నటించిన టిల్లు స్క్వేర్ (Tillu Square ) ఒక్క తెలుగులో మాత్రమే రిలీజ్ అయినా, ఇండియాలో హైయెస్ట్ కలెక్షన్స్ ని కూడా సొంతం చేసుకుని ఈ సినిమా మాస్ రచ్చ లేపగా, ఆ తర్వాత ప్లేస్ లో మలయాళం నుండి పృథ్వీరాజ్ సుకుమారన్ చాలా ఏళ్ళు గా తీసిన సినిమా ‘ది గోట్ లైఫ్’ (ఆడుజీవితం) ఎట్టకేలకు రిలీజ్ అయి ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో రెండో ప్లేస్ లో నిలిచింది. ఇక బాలీవుడ్ లో రిలీజ్ అయిన క్రూ మూవీ మూడో ప్లేస్ లో నిలిచింది. అయితే వీటిలో ఆడుజీవితం అండ్ క్రూ మూవీలు ఇండియా వైడ్ గా భారీ ఎత్తున రిలీజ్ అవగా, టిల్లు స్క్వేర్ మాత్రం కేవలం తెలుగు రాష్ట్రాల కలెక్షన్స్ తోనే మేజర్ గా అన్ని సినిమాలను డామినేట్ చేయడం విశేషం. ఇక సమ్మర్ లో వచ్చే ఇతర తెలుగు క్రేజీ సినిమాలు కూడా ఇదే జోరుని కొనసాగిస్తాయో లేదో చూడాలి. ఇక వచ్చే వారం ఏప్రిల్ 5న విజయ్ దేవరకొండ నటించిన ఫ్యామిలీ స్టార్ సినిమా గ్రాండ్ గా విడుదల కానుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు