Tollywood Box Office : జనవరి నుంచి మార్చ్ వరకు బాక్స్ ఆఫీస్ ప్రోగ్రెస్

2024 స్టార్ హీరోల మధ్య బాక్స్ ఆఫీస్ వార్ తో స్టార్ట్ అయిన విషయం తెలిసిందే. అప్పుడే ఈ ఏడాదిలో మొదటి మూడు నెలలు గడిచిపోయాయి. మరి జనవరి నుంచి మార్చ్ వరకు బాక్స్ ఆఫీస్ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఎలా ఉంది అనే విషయంపై ఓ లుక్కేద్దాం.

జనవరి పోరు

సర్కారు నౌకరి అనే ప్రయోగాత్మక చిన్న మూవీతో 2024 మొదలైంది టాలీవుడ్ కు. జనవరి 1న రిలీజ్ అయిన ఈ మూవీ డిజాస్టర్ గా నిలిచింది. ఆ తర్వాత రిలీజ్ అయిన కొన్ని చిన్న సినిమాలు కూడా ఫెయిల్యూర్ నే చవి చూసాయి. సంక్రాంతి బరిలో నిలిచిన సినిమాలు మాత్రం అందరి దృష్టిని ఆకర్షించాయి. జనవరి 12న గుంటూరు కారం, హనుమాన్ సినిమాలు రిలీజ్ కాగా, వీటి మధ్య ఏర్పడిన క్లాష్ టాక్ ఆఫ్ ది టౌన్ అయింది. గుంటూరు కారం లాంటి పెద్ద సినిమాను హనుమాన్ ఈజీగానే ఓడించాడు. 13న సైంధవ్, 14న నా సామి రంగ సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఈ రెండిట్లో నా సామి రంగ విన్నర్ గా నిలిచింది. మొత్తంగా చూసుకుంటే సంక్రాంతి సినిమాల్లో హనుమాన్ దే పైచేయి అయ్యింది. రిపబ్లిక్ డే కానుకగా రిలీజ్ అయిన కెప్టెన్ మిల్లర్ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. అదే సమయంలో రిలీజ్ కావాల్సిన అయాలాన్ పలు కారణాల వల్ల ఆఖరి నిమిషంలో వాయిదా పడింది.

ఫిబ్రవరిలో బాక్స్ ఆఫీస్ మొద్దు నిద్ర

ఫిబ్రవరి మంత్ అనేది సినిమాలకు అన్ సీజన్ అని చెప్పొచ్చు. కాబట్టి చాలావరకు ఈ నెలలో సినిమాలను రిలీజ్ చేయడానికి మేకర్స్ ఆసక్తిని కనబరచరు. ఈ ఏడాది ఫిబ్రవరిలో అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు, హ్యాపీ ఎండింగ్, బూట్ కట్ బాలరాజు, కిస్మత్ వంటి వాటితో పాటు చాలానే చిన్న సినిమాలు రిలీజ్ అయ్యాయి. వీటిలో అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ ఒక్కటే పర్వాలేదు అనిపించేలా చేసింది. ఫిబ్రవరి రెండో వారంలో రిలీజ్ అయిన ఈగల్, లాల్ సలాం సినిమాలు డిజాస్టర్ గా నిలిచాయి. ఆ తర్వాత వచ్చిన ఊరు పేరు భైరవకోన మూవీ హిట్ టాక్ తెచ్చుకుంది. కానీ కమర్షియల్ గా మాత్రం సక్సెస్ కాలేదు. ఫిబ్రవరి మూడో వారంలో డబ్బింగ్ మూవీ భ్రమయుగం, మస్తు షేడ్స్ ఉన్నాయ్, సిద్ధార్థ్ రాయ్, రాజధాని ఫైల్స్ సినిమాలు వచ్చాయి. ఇందులో భ్రమయుగం మూవీ మాత్రమే సక్సెస్ అయ్యింది.

- Advertisement -

మార్చ్ తో మొదలైన కళ…

మార్చ్ లో చిన్న సినిమాలతో పాటు మీడియం రేంజ్ బడ్జెట్ సినిమాలు రిలీజ్ అయ్యాయి. అందులో చాలావరకు డిజాస్టర్ గా మిగిలినప్పటికీ, టిల్లు స్క్వేర్ తో బాక్స్ ఆఫీస్ షేక్ అవుతోంది. మార్చ్ మొదటి వారంలో ఆపరేషన్ వాలెంటైన్, చారి 111, భూతద్దం భాస్కర్ నారాయణ వంటి 13 చిన్న, మిడ్ రేంజ్ సినిమాలు థియేటర్లలోకి వచ్చాయి. కానీ అందులో ఒక్కటి కూడా ఆకట్టుకోలేకపోయింది. ఆ తర్వాత వచ్చిన భీమా, గామి మిక్స్డ్ టాక్ తెచ్చుకున్నాయి. అదే వారంలో ప్రేమలు అనే మలయాళ మూవీ వచ్చి తెలుగు ఆడియన్స్ ను బాగానే అలరించింది. ఇక గతేడాది సామజవరగమన మూవీతో హిట్ ను తన ఖాతాలో వేసుకున్న శ్రీ విష్ణు ఈ ఏడాది మార్చ్ లో ఓం భీమ్ బుష్ తో యావరేజ్ మూవీని ఇచ్చాడు. చివరి వారంలో రిలీజ్ అయిన టిల్లు స్క్వేర్ వసూళ్ళ వర్షం కురిపిస్తోంది. ఈ మూవీ కంటే ఒకరోజు ముందే రిలీజ్ అయిన మలయాళం మూవీ ది గోట్ లైఫ్ కూడా మంచి రెస్పాన్స్ నే తెచ్చుకుంది. ఈ మూడు నెలలు ఇలా సాగగా… ఏప్రిల్, మేలో కూడా చిన్న, మీడియం రేంజ్ బడ్జెట్ సినిమాల సందడే కనిపించబోతోంది. పాన్ ఇండియా సినిమాలు ఈ సమ్మర్ లో రిలీజ్ అయ్యే అవకాశాలు లేవు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు