Prabhash: నచ్చితే ఖచ్చితంగా గిఫ్ట్.. తెలిస్తే షాక్..!

Prabhash..టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా రెబల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్.. ఒకానొక సమయంలో దివంగత నటుడు రెబల్ స్టార్ కృష్ణంరాజు నట వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి తన నటనతో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలు చేస్తూ భారీ పాపులారిటీ దక్కించుకుంటున్న హీరోగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి ఎంత మంచి పేరు సంపాదించుకున్నారో మనకు తెలిసిందే.. అంతేకాదు ఇండియన్ సినీ ఇండస్ట్రీలో అత్యధిక పారితోచకం తీసుకుంటున్న హీరోగా కూడా రికార్డు సృష్టించారు మొదటిసారి రూ.100 కోట్ల పారితోషకం అందుకున్న హీరో కూడా ఈయనే.. ఇలా నటుడిగా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు పొందిన ప్రభాస్.. వ్యక్తిగత జీవితంలో కూడా అంతకంటే మంచి మనసు కలిగి ఉన్నటువంటి వ్యక్తిగా పేరు సొంతం చేసుకున్నారు.. ముఖ్యంగా కుటుంబంతో పాటు సన్నిహితులకు కూడా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు ప్రభాస్..

అయితే ఇక్కడ విచిత్రం ఏమిటంటే కుటుంబం కంటే ఎక్కువగా స్నేహితులకే ప్రాధాన్యత ఇస్తారు .. ఒకసారి ప్రభాస్ తో స్నేహం చేస్తే ఆ ప్రాణం పోయే వరకు వారితో స్నేహాన్ని వదిలి పెట్టుకోరు ప్రభాస్.m అలా ఇండస్ట్రీలో ప్రభాస్ కి చాలామంది స్నేహితులు ఉన్నారు. ఎంతోమంది సెలబ్రిటీలు ప్రభాస్ తో తమకున్న స్నేహబంధం గురించి అలాగే ప్రభాస్ వ్యక్తిత్వం గురించి చెబుతూ ఉంటారు.. ఈ క్రమంలోనే తాజాగా ప్రభాస్ కి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదేమిటంటే ప్రభాస్ కి గనుక ఎవరైనా నచ్చితే వారితో ఫ్రెండ్షిప్ చేస్తే వారికి మరిచిపోలేని గిఫ్ట్ లను ఇస్తూ ఉంటారట ప్రభాస్..

ఏంటా గిఫ్ట్..
తరచూ తనకు నచ్చిన వారి ఇంటికి వివిధ రకాల భోజనాలను పంపించడం ఆనవాయితీగా చేస్తూ ఉంటారు. అంతేకాకుండా వారిని తన స్నేహితులుగా భావించి వారితో బాగా క్లోజ్ అయితే కనుక తప్పకుండా వారికి ప్రభాస్ నుంచి ఒక వాచ్ కానుకగా వెళ్తుందని సమాచారం.. ఈ విధంగా ప్రభాస్ తన ప్రాణ స్నేహితులకు ఒక వాచ్ ను బహుమతిగా ఇస్తారని.. ఇప్పటికే ఎంతోమంది సెలబ్రిటీలు ప్రభాస్ నుంచి కానుకగా అందుకున్న వాచ్ లను సోషల్ మీడియా ద్వారా కూడా షేర్ చేశారు.. ఇక ఇప్పటికే ప్రభాస్ ఎంతోమంది హీరో హీరోయిన్ల కి , కొరియోగ్రాఫర్లకు, డైరెక్టర్లకి అలాగే తనకు నచ్చిన ప్రాణ స్నేహితులకు ఇలా వాచ్ లను బహుమతిగా పంపించారని తెలుస్తోంది..

- Advertisement -

ప్రభాస్ సినిమాలు..
ప్రభాస్ సినిమాల విషయానికి వస్తే.. కల్కి2898ఏడీ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే.. ఈ సినిమాని పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధమవుతున్నారు. ఇక వీటితోపాటు స్పిరిట్, రాజా సాబ్ ,సలార్ 2 వంటి చిత్రాలలో కూడా నటించబోతున్నారు. మొత్తానికైతే ప్రభాస్ అందిస్తున్న ఈ బహుమతిని చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు