Tillu Square OTT : OTTలోకి టిల్లు స్క్వేర్.. ఎప్పుడంటే?

Tillu Square OTT : టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో యంగ్ హీరోల సినిమాలు వస్తున్న సంగతి తెలిసిందే. ఎలాంటి అంచనాలు లేకుండా ఈ హీరోల సినిమాలు బంపర్ హిట్ అవుతున్నాయి. రొమాంటిక్ అలాగే కామెడీ, సస్పెన్స్ థ్రిల్లర్ కథలను ఎంచుకొని యంగ్ హీరోలు సినిమాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గత రెండు సంవత్సరాలుగా చాలామంది హీరోలు మంచి విజయాలను అందుకున్నారు.

అచ్చం అలాగే సిద్దు జొన్నలగడ్డ డిజె టిల్లు సినిమాతో బంపర్ హిట్ అందుకున్నాడు. అప్పటివరకు ఎవరికీ తెలియని సిద్దు జొన్నలగడ్డ… డిజె టిల్లు సినిమా తర్వాత టాప్ మోస్ట్ హీరోగా మారిపోయాడు. సీనియర్ హీరోలకు కూడా చెమటలు పట్టించేలా చేస్తున్నాడు సిద్దు జొన్నలగడ్డ. కామెడీ, టైమింగ్ డైలాగ్స్, యాక్షన్స్ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో టాలెంట్స్ ఉన్న హీరో సిద్దు జొన్నలగడ్డ.

అయితే డిజె టిల్లు సిక్వన్స్ లోనే టిల్లు స్క్వేర్ సినిమాను తీసుకువచ్చాడు సిద్దు జొన్నలగడ్డ. మొన్న ఈ సినిమా రిలీజ్ అయింది. ప్రస్తుతం హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో సినిమా నడుస్తోంది. గత మూడు రోజులుగా ఫుల్ కలెక్షన్స్ రాబడుతోంది టిల్లు స్క్వేర్ సినిమా.

- Advertisement -

ఈ సినిమాలో సిద్దు జొన్నలగడ్డ హీరోగా చేయగా… పార్ట్ 2 లో మాత్రం అనుపమ పరమేశ్వరన్ ను రంగంలోకి దింపారు. పూర్తిగా క్రైమ్ సస్పెన్షన్, అలాగే కామెడీ యాంగిల్ లో ఈ సినిమాను తీసుకువచ్చారు. మళ్లీ చివరికి ఒక లేడీ ని విలన్ గా చూపించే ప్రయత్నం చేశారు ఈ సినిమాలో ! ఏదైతేనేం టిల్లు స్క్వేర్ సినిమా మాత్రం ప్రేక్షకులకు అద్భుతంగా నచ్చేసింది. దీంతో టికెట్లను కొనుగోలు చేసేందుకు యూత్ తో పాటు కుటుంబ సమేతంగా ఎగబడుతున్నారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ అలాగే రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్న థియేటర్లన్నీ హౌస్ ఫుల్ అవుతున్నాయి.

ఇలాంటి నేపథ్యంలోనే టిల్లు స్క్వేర్ సినిమా నుంచి ఆసక్తికర విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సినిమాకు సంబంధించిన ఓటిటి ( Tillu Square OTT ) తేదీ ఖరారు అయిందట. ఈ సినిమా ఓటిటి రైట్స్ నెట్ ఫ్లిక్స్ కొనుగోలు చేసిందట. సినిమాపై పాజిటివ్ టాక్ రావడంతో భారీ రేటు పెట్టి కొనుగోలు చేసిందట నెట్ ఫ్లిక్స్. ఇక ఏప్రిల్ చివరి వారంలో లేదా మే మొదటి వారంలో ఈ సినిమా ఓటీటీ లో స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం అందుతోంది. దీని పై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు