Nani Movies : ఈ నిర్మాతలతో మాత్రమే సినిమా… నాని ఎందుకిలా చేస్తున్నాడంటే?

Nani Movies : గతేడాది టాలీవుడ్ యంగ్ హీరోలు అందరికీ చేదు అనుభవాలనే మిగుల్చగా, ఒక్క నానికి మాత్రమే బాగా కలిసి వచ్చింది. దసరా, హాయ్ నాన్న వంటి సినిమాలతో వరుసగా బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకొని జోరు మీద ఉన్నాడు. నాని నెక్స్ట్ దాదాపు అరడజను సినిమాలను లైన్లో పెట్టే పనిలో పడ్డారు. అయితే ఈ హీరో ఇదివరకు తాను సినిమాలు చేసిన దర్శకులు, నిర్మాతలనే మళ్లీ మళ్ళీ రిపీట్ చేస్తున్నారు. మరి నాని ఎందుకు ఇలా చేస్తున్నాడు? అనే వివరాల్లోకి వెళితే…

ఆ నిర్మాతలు, దర్శకులే రిపీట్…

ప్రస్తుతం నాని సరిపోదా శనివారం అనే మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీకి వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించబోతున్నాడు. గతంలో వీళ్ళిద్దరి కాంబోలో వచ్చిన అంటే సుందరానికి మూవీ ప్లాప్ అయ్యింది. ఈ మూవీని దానయ్య నిర్మిస్తుండగా, ఇప్పటికే డివివి దానయ్యతో రెండు సినిమాలకు సైన్ చేశాడు నాని. సరిపోదా శనివారం మూవీతో పాటు నాని నెక్స్ట్ మూవీని కూడా దానయ్యే నిర్మిస్తుండడం విశేషం. ఈ మూవీకి సుజిత్ దర్శకత్వం వహించబోతున్నారు. ఆ తర్వాత గతంలో దసరా మూవీకి దర్శకత్వం వహించిన డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలతో మరో కొత్త మూవీని నాని రీసెంట్ గా ప్రకటించాడు. వీళ్ళిద్దరి కాంబోలో ఇది రెండవ మూవీ. సుధాకర్ చెరుకూరి ఈ మూవీని నిర్మించబోతున్నారు. అనంతరం బలగం వేణు దర్శకత్వంలో నిర్మాత దిల్ రాజుతో మరో కొత్త మూవీకి సైన్ చేశాడు నాని. ఇదివరకే నాని, దిల్ రాజు కాంబోలో పలు సినిమాలు వచ్చాయి.

నాని ప్లాన్ ఇదేనా?

ప్రస్తుతం నాని లైనప్ ( Nani Movies ) చూశాక ఈ డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ నే నాని ఎందుకు రిపీట్ చేస్తున్నాడు? అనే అనుమానం కలగక మానదు. అయితే దీని వెనక నాని పెద్ద ప్లానే వేశాడు అంటున్నారు సినీ విశ్లేషకులు. తన రెమ్యూనరేషన్ డిమాండ్ ను కండిషన్స్ లేకుండా ఒప్పుకునే నిర్మాతలతో కలిసి పని చేయడానికి నాని ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడని ఆయన నెక్స్ట్ మూడు సినిమాలు చూస్తే అర్థమవుతుంది. లేదంటే తన ప్రాజెక్టులను ఎలాంటి అడ్డంకులు లేకుండా నిర్మిస్తారనే ఉద్దేశం అయినా అయ్యి ఉండాలి. అలాగే నాని తాను గతంలో పని చేసిన దర్శకులతోనే రిపీటెడ్ గా వర్క్ చేయడానికి కూడా రీజన్ ఉందంటున్నారు. తనతో ఈజీగా కొలాబరేట్ అయ్యే డైరెక్టర్స్ తో పని చేయడానికి నాని ఇష్టపడుతున్నట్టు ఆయన లైనప్ చూస్తే అర్థమవుతుంది. మొత్తానికి నాని కంఫర్ట్ గా వరుస సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు. ఆయన స్ట్రాటజీ కూడా అలాగే వర్కౌట్ అవుతుంది మరి. అందుకే నెమ్మదిగా సినిమాలు చేసుకుంటూ, వరుస బ్లాక్ బస్టర్ హిట్లను తన ఖాతాలో వేసుకుంటున్నాడు నేచురల్ స్టార్. త్వరలోనే తెరపైకి రాబోతున్న “సరిపోదా శనివారం” మూవీపై అంచనాలు భారీగా ఉన్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు