Pooja Hegde Boyfriend : బాయ్ ఫ్రెండ్ తో దొరికిపోయిన పూజ హెగ్డే?

Pooja Hegde Boyfriend : టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్లు ఉన్న సంగతి తెలిసిందే. అందులో కొంతమంది ఇతర రాష్ట్రాల నుంచి వస్తే… కొంతమంది హీరోయిన్లు మాత్రం లోకల్. అంటే తెలుగువారు ఉన్నారు. అయితే ఇందులో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు ఎక్కువగా టాలీవుడ్ ఇండస్ట్రీలో సక్సెస్ అవుతున్నారు. మన తెలుగు వారు మాత్రం వెనుకబడిపోతున్నారు. అయితే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన హీరోయిన్లలో పూజా హెగ్డే ఒకరు. గత రెండు సంవత్సరాల క్రితం వరకు టాలీవుడ్ ఇండస్ట్రీని ఒక ఊపు ఊపింది హీరోయిన్ పూజ హెగ్డే.

కానీ ప్రస్తుతం హీరోయిన్ పూజ హెగ్డే పరిస్థితి అత్యంత దారుణంగా తయారయింది. తెలుగు చిత్రం ఒక లైలా కోసం సినిమాతో మన టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి మార్కులు కొట్టేసింది పూజా హెగ్డే. ఈ సినిమా 2014 సంవత్సరంలో వచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత హీరోయిన్ పూజ హెగ్డే కు టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి మంచి అవకాశాలు వచ్చాయి.

అయితే గత ఏడాదికాలంగా తెలుగు ఇండస్ట్రీలో సరిగా సినిమా ఆఫర్లు రావడం లేదు హీరోయిన్ పూజ హెగ్డేకు..! ప్రిన్స్ మహేష్ బాబు ఇటీవల నటించిన సినిమా గుంటూరు కారం. ఈ సినిమాలో మొదటగా పూజ హెగ్డే హీరోయిన్గా సెలెక్ట్ అయ్యారు. ఈ మేరకు షూటింగ్ కూడా ప్రారంభమైంది. కానీ చివరి క్షణంలో పూజ హెగ్డేను ఈ సినిమా నుంచి తప్పించారు. దీంతో ఆమె కెరీర్ మొత్తం ప్రశ్నార్థకంగా మారిపోయింది. పూజా హెగ్డే స్థానంలో హీరోయిన్ శ్రీ లీలాను తీసుకువచ్చారు. సెకండ్ హీరోయిన్ గా మీనాక్షి చౌదరిని తీసుకువచ్చారు చిత్ర బృంద సభ్యులు.

- Advertisement -

ఇది ఇలా ఉండగా తాజాగా హీరోయిన్ పూజ హెగ్డే తన బాయ్ ఫ్రెండ్ ( Pooja Hegde Boyfriend ) తో కనిపించినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించిన ఫోటో అలాగే వీడియో వైరల్ గా మారింది. వాస్తవానికి ముంబైలో పూజా హెగ్డే మరో బాలీవుడ్ నటుడు అయినా రోహన్ మెహరా తో కలిసి కారులో కనబడింది. ఓ ప్రైవేట్ పార్టీకి ఈ ఇద్దరు వచ్చారట. దీంతో వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని నేషనల్ మీడియా కథనాలు రాస్తోంది.

అయితే ఇందులో ఏ మేరకు నిజం ఉందో తెలియదు కానీ మొత్తానికి వీరిద్దరూ ప్రేమలో ఉన్నట్లు మాత్రం వార్తలు వస్తున్నాయి. దీనిపై పూజ హెగ్డే క్లారిటీ ఇవ్వాల్సి ఉంటుంది. కాగా పూజ హెగ్డే తో కనబడిన రోహన్… బాలీవుడ్ ఇండస్ట్రీలో అసిస్టెంట్ డైరెక్టర్గా కెరీర్ స్టార్ట్ చేసి నటుడిగా మారాడు. బజార్ సినిమాతో పాపులర్ హీరో అయ్యాడు రోహన్.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు