Prasanth Varma Cinematic Universe : జై హనుమాన్ యాక్టింగ్ చేస్తారా…? ప్రశాంత్ వర్మ ఆఫర్

Prasanth Varma Cinematic Universe : టాలీవుడ్ ఇండస్ట్రీలో అనేక రకాల సినిమాలు వస్తున్న సంగతి తెలిసిందే. అందులో క్రైమ్, రొమాంటిక్, ఎమోషనల్, కుటుంబ సమేత చిత్రాలు వస్తున్నాయి. ఇక కొన్ని సినిమాలు దేవుడి నేపథ్యంలో వచ్చి బంపర్ హిట్ కొట్టినవి కూడా ఉన్నాయి. అప్పుడెప్పుడో వచ్చిన అన్నమయ్య సినిమా నుంచి ఇప్పటి హనుమాన్ సినిమా వరకు దాదాపు దేవుడి పేరుతో వచ్చిన సినిమాలు అన్ని హిట్ అయ్యాయి. ఇటీవల యంగ్ హీరో తేజ హీరోగా చేసిన హనుమాన్ సినిమా బంపర్ విజయాన్ని అందుకుంది.

హనుమాన్ సినిమాకు దేశవ్యాప్తంగా పాపులారిటీ వచ్చింది. ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో హనుమాన్ సినిమా ను బిజెపి వారు కూడా వాడుకునేలా చేసింది. చిన్న సినిమాగా విడుదలై దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన చిత్రం ఈ హనుమాన్. ఈ ఏడాది సంక్రాంతికి వచ్చి బాక్సాఫీస్ ముందు బ్లాస్ట్ అయింది. నిర్మాతలపై లాభాలతో వసూళ్ల వర్షాన్ని కురిపించింది. కథతోపాటు గ్రాఫిక్స్ అద్భుతంగా ఉండటంతో ప్రేక్షకులంతా థియేటర్లకు క్యూ కట్టేలా చేసింది ఈ హనుమాన్ సినిమా. అంతే కాదు ఈ హనుమాన్ సినిమాతో ప్రభాస్ లాంటి ఆది పురుష్ సినిమా కూడా వెనుకబడిపోయింది.

- Advertisement -

హనుమాన్ సినిమాను చూపిస్తూ ఆది పురుష్ లాంటి పెద్ద సినిమాను కూడా ట్రోలింగ్ చేశారు. ఇంతటి పెద్ద హిట్ కొట్టిన సినిమాకు దర్శకుడు ప్రశాంత్ వర్మ. అతడు తీసినవి కొన్ని సినిమాలు అయినప్పటికీ ఆల్మోస్ట్ అన్ని హిట్ అయ్యాయి. అటు ఈ సినిమాలో హీరో తేజ సజ్జ కథానాయకుడిగా వ్యవహరించాడు. వరలక్ష్మి, గెటప్ శీను, సముద్ర కని, వినయ్ లాంటి కీలక నటీనటులు ఇందులో నటించారు. 30 కోట్ల బడ్జెట్తో రిలీజ్ అయిన ఈ సినిమా ఏకంగా 350 కోట్లకు పైగా వాసులను రాబట్టింది అంటే ఈ సినిమా ఏ మేరకు సక్సెస్ అయిందో చూడవచ్చు.

ఇక ప్రస్తుతం హనుమాన్ సినిమా రెండవ భాగం త్వరలోనే రానున్నట్లు ఇప్పటికే చిత్ర బృందం ప్రకటించింది. ఆ పనిలోనే దర్శకుడు ప్రశాంత్ వర్మ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఓ కీలక ప్రకటన చేశారు దర్శకుడు ప్రశాంత్ వర్మ. హనుమాన్ సినిమాలో ఎవరైనా నటించాలనుకుంటే… వెంటనే తమను కాంటాక్ట్ కావాలని పోస్ట్ పెట్టారు దర్శకుడు ప్రశాంత్ వర్మ. జై హనుమాన్ సినిమా లో ఏ పాత్రకైనా భాగం కావాలను ఉంటే వెంటనే talent@thepicu.com ను సమాచారం అందించాలని దర్శకుడు కోరారు. కాగా, ప్రశాంత్ వర్మ తన ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లో ( Prasanth Varma Cinematic Universe ) భాగంగా, హనుమాన్, జై హనుమాన్, అధీర తో పాటు మరి కొన్ని సూపర్ హీరోస్ సినిమాలు చేయబోతున్న సంగతి తెలిసిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు