Rashmika Mandanna : రష్మిక షెడ్యూల్ బిజీ బిజీ… కానీ వీకెండ్ లో మాత్రం ఆమె చేసే పని ఇదొక్కటే

Rashmika Mandanna : నేషనల్ క్రష్ రష్మిక మందన్న గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. సౌత్ నుంచి నార్త్ దాకా ఈ బ్యూటీ క్రేజ్ పుష్ప మూవీతో ఒక్కసారిగా పాకిపోయింది. ప్రస్తుతం నడుస్తున్న పాన్ ఇండియా రేసులో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ రష్మికనే. దీంతో ఆమె గురించి ఎలాంటి వార్త బయటకు వచ్చినా ఇట్టే వైరల్ అయిపోతుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా రష్మిక పర్సనల్ లైఫ్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ విషయం బయటపడింది. వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ బ్యూటీ వీక్ అంతా షూటింగ్ షెడ్యూల్స్ తో గజిబిజిగా గడిపేస్తూ ఉంటుంది. అయితే ఒక్క వీకెండ్ మాత్రం కచ్చితంగా ఓ పని చేస్తుందట రష్మిక. మరి అదేంటంటే…

ప్రతి వీకెండ్ ఈ పని చేయడం మాత్రం మస్ట్…

రష్మిక తన క్యూట్ యాక్టింగ్ తో ఎంతోమంది కుర్రాళ్లను తన వైపుకు తిప్పుకుంది. ఒక వైపు సినిమాలు, మరోవైపు బోల్డ్ ఫోటో షూట్స్ తో అభిమానులను మెస్మరైజ్ చేస్తుంది ఈ బ్యూటీ. ఇటీవల కాలంలో సినిమాల్లో బోల్డ్ గా నటించడానికి కూడా వెనకాడట్లేదు. రీసెంట్ గా యానిమల్ మూవీలో ఇన్నర్ వేర్ లో కనిపించి షాక్ ఇచ్చింది. బాలీవుడ్ లో మిషన్ మజ్ను, గుడ్ బాయ్ వంటి సినిమాలతో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని క్రియేట్ చేసుకోవడానికి రష్మిక గట్టిగానే ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇప్పటికే యానిమల్ మూవీతో అక్కడి సినీ జనాలను విశేషంగా ఆకట్టుకుంది. ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో క్షణం తీరిక లేకుండా ఉన్న ఈ బ్యూటీ వీకెండ్ లో మాత్రం కచ్చితంగా ఓ పనికి టైం కేటాయిస్తుందట. ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ వీకెండ్ లో ఫ్యామిలీ కోసం కచ్చితంగా కాస్త టైం స్పెండ్ చేస్తుందట రష్మిక. ఇక అంతకంటే ఎక్కువగా ఫ్రెండ్స్ తో గడపడానికి ఇష్టపడుతుందట. ప్రతి వీకెండ్ ఇలా తన సన్నిహితులతో సరదాగా గడుపుతుందట రష్మిక.

రష్మిక సినిమాల విషయానికి వస్తే…

ప్రస్తుతం రష్మిక దాదాపు అరడజను సినిమాలతో ఫుల్ బిజీ గా ఉంది. అల్లు అర్జున్ తో కలిసి పుష్ప 2లో నటిస్తోంది. ఈ ఏడాది ఆగస్టు 15న ఈ మూవీ పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే ఫస్ట్ పార్ట్ “పుష్ప“లో తన లుక్స్, యాక్టింగ్ తో సినీ ప్రియులను విశేషంగా అలరించింది. దీంతో సెకండ్ పార్ట్ పై అంచనాలు పెరిగిపోయాయి. ఈ సినిమాతో పాటు రష్మిక రెయిన్ బో, ది గర్ల్ ఫ్రెండ్ వంటి సినిమాల్లో కూడా యాక్ట్ చేస్తోంది. ది గర్ల్ ఫ్రెండ్ మూవీకి రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తుండగా, ఈ మూవీ టీజర్ ను రష్మిక పుట్టినరోజు సందర్భంగా ఏప్రిల్ 5న రిలీజ్ చేయబోతున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు