V.V.Vinayak: ఛత్రపతి హిందీ ట్రైలర్.. ఎదో తేడాగా ఉందే?

2005 లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా S.S. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన “ఛత్రపతి” ఎంత పెద్ద హిట్టో మనకి తెలిసిందే. ఈ సినిమాతోనే ప్రభాస్ స్టార్ హీరోగా స్టార్ డమ్ దక్కించుకున్నాడు. ఈ సినిమా ఇతర భాషల్లో రీమేక్ చేసినా ఎక్కడా ఈ సినిమాను మ్యాచ్ చేయలేకపోయాయి. ఫలితంగా అక్కడ ప్లాప్ అయ్యాయి. ఇప్పుడు ఛత్రపతి సినిమాను హిందీలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా టాలీవుడ్ మాస్ డైరెక్టర్ అయిన వి.వి.వినాయక్ రీమేక్ చేయడం జరిగింది.పెన్ స్టూడియోస్ బ్యానర్ లో ఈ సినిమా నిర్మించగా, పూర్తి బాలీవుడ్ తారాగణం తో రూపొందించబడింది.

తాజాగా ఛత్రపతి హిందీ ట్రైలర్ మే 2 న చిత్ర యూనిట్ విడుదల చేసారు. అయితే ఈ ట్రైలర్ మొత్తం బాలీవుడ్ మసాలా తో నిండి పోయింది. ట్రైలర్ చూస్తుంటే ఈ సినిమా కోసం బెల్లంకొండ శ్రీనివాస్ బాగానే కష్టపడ్డాడనిపిస్తుంది. హిందీ ఆడియన్స్ ని ఆకట్టుకోవడానికి సిక్స్ ప్యాక్ కూడా చేసాడు. సినిమాను ఎక్కడా తగ్గకుండా రిచ్ గా తెరకెక్కించారని ట్రైలర్ చూస్తే అర్ధమవుతుంది. కానీ ప్రభాస్ ఛత్రపతి రేంజ్ లో సగం కూడా ఈ హిందీ ట్రైలర్ లేదని తెలుస్తుంది.

- Advertisement -

సినిమా లో పెద్దగా మార్పులు చేయకుండా అదే స్టోరీని దించేశారు. కాకపోతే తెలుగులో శ్రీలంక శరణార్థుల్లా హీరో వస్తే, హిందీలో పాకిస్థాన్ నుంచి వచ్చిన శరణార్థిలా చూపిస్తారు. ఇక ఈ మూవీలో హీరోయిన్ గా “నష్రత్ భరూచా” నటించింది. అయితే ఈ హీరోయిన్ అస్సలు సెట్ కానీ రోల్ చేసినట్టు అనిపిస్తుంది. ఇక సినిమాలో కీలకమైన అమ్మపాత్ర ఒకప్పటి బాలీవుడ్ హీరోయిన్ భాగ్యశ్రీ నటించింది. రీసెంట్ గా ఈమె రాధేశ్యామ్ లో ప్రభాస్ కి అమ్మగా నటించిన విషయం తెలిసిందే.

ఇక రాజమౌళి సినిమాల్లో విలన్ హీరో కంటే పవర్ ఫుల్ గా ఉంటాడని తెలిసిందే. కానీ ఈ హిందీ ట్రైలర్ లో అలా ఉన్నట్లు కనిపించలేదు. మొత్తంగా ట్రైలర్ కట్ కూడా అంత ఇంట్రెస్టింగ్ గా లేదు. అయితే బెల్లం కొండ శ్రీనివాస్ కి యూట్యూబ్ డబ్బింగ్ మూవీస్ వల్ల ఉన్న క్రేజ్ దృష్ట్యా, బాలీవుడ్ ఆడియన్స్ కి సౌత్ సినిమాల పట్ల పెరుగుతున్న ఆదరణ వల్ల ఈ సినిమాకి కొద్దిపాటి మౌత్ టాక్ బాగా వచ్చినా హిందీలో మంచి విజయం సాధించే అవకాశం ఉంది. అదే విధంగా తేడా వస్తే దారుణంగా ప్లాప్ అయి విమర్శలపాలయ్యే అవకాశం కూడా ఉంది. ఆ ఫైనల్ రిజల్ట్ గురించి తెలియాలంటే మే12న సినిమా విడుదలయ్యే వరకు వేచి చూడాలి.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు