Akhil : అప్పుడే ఓటిటిలోకి వస్తున్న ఏజెంట్

అఖిల్ అక్కినేని హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన చిత్రం ఏజెంట్. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర ఈ సినిమాని నిర్మించారు. అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా రీసెంట్ గానే ప్రేక్షకుల ముందుకి వచ్చింది. టీజర్, ట్రైలర్ తో మంచి అంచనాలు క్రియేట్ చేసిన ఈ సినిమా రిలీజైన తరువాత మాత్రం ప్రేక్షకులని మెప్పించలేకపోయింది.

అయితే రిలీజైన రోజు నుంచే ఏజెంట్ కి ప్లాప్ టాక్ రావడంతో రెండో రోజు నుంచి జనాలు థియేటర్ కి వెళ్లడం మానేశారు. గత సినిమాలతో పోలిస్తే అఖిల్ పెర్ఫామెన్స్ పర్వాలేదనిపించిన, కథ లో ఎలాంటి ఎమోషన్ లేకపోవడంతో ఏజెంట్ సినిమా డిజాస్టర్ గానిలిచింది. మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి సైతం సినిమాని సేవ్ చేయలేకపోయాడు. ఇక ఏజెంట్ ప్లాప్ విషయమై ప్రొడ్యూసర్ అనిల్ సుంకర స్పందిస్తూ ” కథ పూర్తిగా లేకుండ, ప్రాపర్ ప్లానింగ్ లేకుండా షూట్ చేయడం వల్ల ఏజెంట్ సినిమా ప్రేక్షకులకి నచ్చలేదు. ఏజెంట్ సినిమా ప్లాప్ కి మేము పూర్తి బాధ్యత వహిస్తున్నాం, మీరు మాపై పెట్టుకున్న నమ్మకాన్నిరీచ్ అవనందుకుక్షమించండి. ఇలాంటి పొరపాటు మరోసారి జరగకుండా చూసుకుంటాం” అని ఆయన ట్విట్టర్ లో పోస్ట్ చేసారు.

అయితే ఏజెంట్ సినిమా డిజిటల్ రిలీజ్ ని సోనీలైవ్ సంస్థ కొనుగోలు చేసింది. సినిమాకి ప్లాప్ టాక్ వస్తుండటంతో సోనీలైవ్ ఏజెంట్ సినిమా డిజిటల్ రిలీజ్ తొందరలోనే చేయడానికి చుస్తున్నరంట. ఈ(మే ) నెల 19నుంచి ఏజెంట్ సినిమా స్ట్రీమ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారంట. అయితే సినిమా ఇంకా థియేటర్స్ లో ఒక మోస్తరు గా ఆడుతుండటంతో వచ్చే వారం సినిమా రిపోర్ట్స్ చూసి అఫిషల్ గా డేట్ ని ఎనౌన్స్ చేస్తారని టాక్. అసలే ప్లాప్ టాక్ తో నడుస్తున్న ఏజెంట్ కి ఓటిటి రిలీజ్ కూడా ఇంత ఎర్లీ గా వస్తే ఇంకా సినిమా బిజినెస్ ఎంత లాస్ లో ముగుస్తుందో ఏంటో చూడాలి.

- Advertisement -

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Web Stories, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు