Bhuvana Vijayam: సునీల్ మళ్ళీ హీరోగా చేస్తున్నాడా?

టాలీవుడ్ లో కమెడియన్ గా ఎంట్రీ ఇచ్చి హీరోగా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వైవిధ్యమైన పాత్రలు చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు సునీల్. ఈయన గురించి టాలీవుడ్ లో తెలియని వారుండరు. ఒకప్పుడు సునీల్ కామెడీ కి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉండేది. 2000 లో “నువ్వే కావాలి” సినిమాతో కమెడియన్ గా ఎంట్రీ ఇచ్చిన సునీల్ ఆ తర్వాత నువ్వు నాకు నచ్చావ్ లో బంతిగా నవ్వించి మంచి కామెడీని పండించాడు. ఆ తర్వాత సొంతం సినిమాతో స్టార్ కమెడియన్ గా ఎదిగాడు. తెలుగులో బ్రహ్మానందం తర్వాత ఆ రేంజ్ కామెడీ చేయగల నటుడిగా సునీల్ పేరుతెచ్చుకున్నాడు.

ఆ తర్వాత 2006 అందాల రాముడు చిత్రం తో హీరోగా మారాడు సునీల్. ఆ సినిమా అప్పట్లోనే 100 రోజులాడి సూపర్ హిట్టయ్యింది. ఆ తర్వాత కూడా కమెడియన్ గా సినిమాలు చేసాడు. కానీ 2010 లో రాజమౌళి దర్శకత్వంలో హీరోగా చేసిన మర్యాద రామన్న సునీల్ కమెడియన్ గా మానేసి హీరోగా మూవీస్ చేశాడు. పూలరంగడు, జక్కన్న వంటి సినిమాలతో మంచి హిట్ కొట్టాడు. కానీ ఆ తర్వాత చేసిన సినిమాలు ప్లాప్ అవడం తో మళ్ళీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా టర్న్ తీసుకొని అన్ని రకాల పాత్రలు చేసాడు. కలర్ ఫోటో, పుష్ప సినిమాల్లో విలన్ గా ఎంతో వైవిధ్యమైన నటనాతో విమర్శకుల ప్రశంసలందుకున్నాడు.

అయితే తాజాగా సునీల్ మళ్ళీ హీరోగా భువన విజయం అనే సినిమా చేయడం జరిగింది. ఈ సినిమా ట్రైలర్ మే2 న విడుదల చేశారు. యల్లమంద చరణ్ దర్శకత్వంలో “హిమాలయా స్టూడియో మ్యాన్షన్స్, మిర్త్ మీడియా బ్యానర్లో ఉదయ్ కిరణ్, వి. శ్రీకాంత్ సంయుక్తంగా నిర్మించారు. పూర్తి కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో టాలీవుడ్ యంగ్ కమెడియన్స్ అందరు ప్రధానపాత్రలు పోషించారు. ఓ సినిమా చిత్రీకరణ తీసే సమయంలో జరిగే సంఘటనల ద్వారా ఉండే కామెడీ డ్రామాయే ఈ సినిమా కాన్సెప్ట్. ఇక ఈ సినిమాలో శ్రీనివాస రెడ్డి, వెన్నెల కిషోర్, వైవాహర్ష, ధన్ రాజ్, పృత్వి, గోపరాజు రమణ, సోనియా చౌదరి ప్రధాన పాత్రల్లో నటించారు. మే 12న భువన విజయం సినిమాను విడుదల చేస్తున్నారు. మరి ఈ సినిమా తర్వాత మళ్ళీ హీరోగా సినిమాలు చేస్తాడా? లేక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొనసాగుతాడా అన్నది తెలియాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు