Dasara: నాని ఖాతాలో మరో రేర్ రికార్డు.

న్యాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన దసరా సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకుపోతుంది. దసరా మూవీ మార్చి 30 న విడుదలై సూపర్ హిట్ టాక్ తో భారీ ఓపెనింగ్స్ ని కొల్లగొట్టింది. మొదటి రోజే 38 కోట్లకి పైగా వసూలు చేసిన ఈ సినిమా మొదటి వారం పూర్తి అయ్యే సరికి 55 కోట్ల షేర్, 96 కోట్లకి పైగా గ్రాస్ ని వసూలు చేసింది. సుకుమార్ శిష్యుడైన శ్రీకాంత్ ఓదెల ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యారు. SLV సినిమాస్ బ్యానర్ లో చెరుకూరి సుధాకర్ ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు.

ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించగా సాయికుమార్, సముద్రఖని, పూర్ణ, దీక్షిత్ శెట్టి తదితరులు ముఖ్య పత్రాలు పోషించారు. సంతోష్ నారాయణన్ మ్యూజిక్ అందించాడు. ఇప్పటికే 100 కోట్ల కి పైగా గ్రాస్ వసూలు చేసి సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతున్న ఈ సినిమా తాజాగా మరో రికార్డు ను అందుకుంది.

దసరా మూవీ ప్రపంచ వ్యాప్తంగా 11 రోజుల్లో 60 కోట్లకి పైగా షేర్ సాధించి రికార్డు సృష్టించింది. ఇది వరకు తెలుగు లో టైర్ 2 హీరోల్లో విజయ్ దేవరకొండ నటించిన గీతా గోవిందం ఒక్కటే 60 కోట్లకి పైగా వసూలు చేసింది. ఈ రికార్డు సాధించిన రెండో యాక్టర్ గా నానికి దసరా సినిమా ద్వారా లభించింది. అయితే టైర్ 2 హీరోల్లో ఎఫ్ 2 సినిమా తో వరుణ్ తేజ్ సాధించినా కూడా అందులో మేజర్ క్రెడిట్ వెంకటేష్ కే పోతుంది.

- Advertisement -

అయితే ఐపీఎల్ ఎఫెక్ట్ వల్ల దసరా సినిమా కలెక్షన్స్ కొంచెం తగ్గుముఖం పట్టినా వీకెండ్స్ లో మాత్రం అదరగొడుతుంది. ఇప్పటికే 110 కోట్లు దాటిన ఈ సినిమా కలెక్షన్స్ క్లోజ్ అయ్యేసరికి 120 కోట్ల వరకు రావచ్చు.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు