Akhil: కొడుకుని రాజమౌళి చేతిలో పెట్టిన నాగార్జున..!

అక్కినేని కుటుంబం నుండి భారీ అంచనాల మధ్య సినీ ఇండస్ట్రీకి హీరోగా పరిచయమైన అఖిల్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. మనం సినిమా క్లైమాక్స్ లో ఒక రెండు నిమిషాలు వెండితెర మీద కనిపిస్తేనే రెండు తెలుగు రాష్ట్రాలు దద్దరిల్లాయి. మొదటి సినిమా “అఖిల్ – ది పవర్ ఆఫ్ జువ్వ” చిత్రానికి స్టార్ హీరో రేంజ్ ప్రీ రిలీజ్ బిజినెస్ మరియు స్టార్ హీరో రేంజ్ ఓపెనింగ్స్ వచ్చాయి. కానీ చివరికి కమర్షియల్ గా పెద్ద ఫ్లాప్ గా మిగిలింది.

ఆ తరువాత వచ్చిన హలో, మిస్టర్ మజ్ను చిత్రాలు కూడా నిరాశపరిచినప్పటికీ.. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ మాత్రం హిట్ గా నిలిచింది. ఇక ఇటీవల సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన స్పై యాక్షన్ త్రిల్లర్ ‘ఏజెంట్’ ఏప్రిల్ 28వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ పరాజయాన్ని మూటగట్టుకుంది. వరుస ఫ్లాప్ లతో గాడి తప్పుతున్న అక్కినేని అఖిల్ సినీ కెరీర్ ఏజెంట్ తో అయినా గాడిలో పడుతుందనుకుంటే అదీ నిరాశ అయింది. ఇప్పుడు అఖిల్ కి కచ్చితంగా ఓ బ్లాక్ బస్టర్ హిట్ కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి ఎనిమిదేళ్లు గడుస్తున్నప్పటికీ ఇప్పటివరకు కెరీర్ లో చెప్పదగ్గ ఒక్క హిట్ సినిమా కూడా అఖిల్ కి పడలేదు.

అయితే సినిమాల విషయంలో ఇన్ని రోజులు అఖిల్ ఇష్టానికి వదిలేసిన నాగార్జున ఇప్పుడు తన కొడుకు జీవితాన్ని తానే చేతిలోకి తీసుకున్నారట. తాజాగా దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళిని కలిసి అఖిల్ తో ఒక సినిమాని సెట్ చేసినట్లుగా తెలుస్తోంది. అంతేకాకుండా ఇందుకోసం నాగార్జున రాజమౌళికి పది కోట్ల రూపాయలు అడ్వాన్స్ సైతం ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా పూర్తయిన వెంటనే రాజమౌళి అఖిల్ తో సినిమా చేయబోతున్నాడని ఇంట్రెస్ట్ వర్గాల్లో బలంగా వినిపిస్తున్న. అయితే ఈ వార్తపై అధికారిక ప్రకటన వచ్చేవరకు ఎదురు చూడాల్సిందే.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు