SSMB28: త్రివిక్రమ్ – మహేష్ సినిమా జాప్యానికి కారణం..?

సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే మొదలైన ఈ సినిమా షూటింగ్ రెండడుగులు ముందుకేస్తే నాలుగడుగులు వెనక్కి అన్నట్టు సాగుతోంది. సాధారణంగా సమ్మర్ సీజన్లో ఫ్యామిలీతో కలిసి వెకేషన్ కోసం ఫారిన్ వెళ్లే మహేష్ బాబు, ఈ ఏడాది ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న కారణంగా షూటింగ్ కి బ్రేక్ ఇచ్చి రెండు సార్లు వెకేషన్ కి వెళ్లి వచ్చాడు. ఫారిన్ నుండి మహేష్ బాబు తిరిగొచినప్పటికీ సినిమా షూటింగ్ ప్రారంభం కావటానికి ఇంకా సమయం పడుతుందని సమాచారం అందుతోంది. ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడ్డ ఈ సినిమా షూటింగ్ జూన్ నెలలో ప్రారంభం అవుతుందని అంటున్నారు. ఇప్పటికే ఈ సినిమా టైటిల్ విషయంలో సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది.

‘అమరావతికి అటు ఇటు’, ‘గుంటూరు కారం’, ‘ఊరికి మొనగాడు’, టైటిల్స్ లో ఏదో ఒకటి ఖరారు చేస్తారని ప్రచారం జరుగుతోంది. మే 31న కృష్ణ జయంతి సందర్బంగా ఈ సినిమా టైటిల్ రివీల్ చేస్తారని సమాచారం. అయితే ప్రచారంలో ఉన్న టైటిల్స్ లో ఏదో ఒకటి ఖరారు చేస్తారా లేక కొత్త టైటిల్ ఏదైనా ఫిక్స్ చేస్తారా అన్న ఆసక్తి నెలకొంది. ఇదిలా ఉండగా, ఈ సినిమా ఆలస్యం అవటానికి కారణం త్రివిక్రమ్ అని మరో వాదన వినిపిస్తోంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సినిమాకు సంబంధించిన కీలక వ్యవహారాలు దగ్గరుండి చూసుకుంటున్న త్రివిక్రమ్, ఈ సినిమాకు పూర్తి సమయాన్ని కేటాయించలేదని, మహేష్ సినిమా ఆలస్యానికి అదే కారణం అని అంటున్నారు.

2024 సంక్రాంతి సందర్భంగా జనవరి 14న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేసిన మేకర్స్, విడుదలకి ఇంకా చాలా సమయం ఉండటంతో షూటింగ్ లో జాప్యాన్ని సీరియస్ గా తీసుకోలేదని అంటున్నారు. అతడు, ఖలేజా సినిమాల తర్వాత మహేష్, త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న సినిమా కావటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవలే విడుదలైన మహేష్ బాబు పోస్టర్ సినిమాకు కావాల్సినంత హైప్ క్రియేట్ చేసింది. పోస్టర్లో మహేష్ సిగరెట్ తో మాస్ లుక్ లో కనిపించటంతో సినిమాపై ఆసక్తి పెరుగుతోంది. చాలా రోజుల తర్వాత మహేష్ బాబు లుక్స్ లో వేరియేషన్ కనిపించటంతో ఫ్యాన్స్ ఖుషీగా ఉన్నారు. మహేష్ బాబు బాడీ లాంగ్వేజ్ తో పాటు, డైలాగ్ మాడ్యులేషన్ కూడా డిఫరెంట్ గా ఉండబోతోంది అన్న టాక్ వినిపిస్తున్న ఈ సినిమా ఏ మేరకు అలరిస్తుందో చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు