Aishwarya Rajinikanth: ధనుష్ ను మర్చిపోలేకపోతున్న ఐశ్వర్య.. ఏం చేసిందంటే..?

సూపర్ స్టార్ రజినీకాంత్ వారసురాలు ఐశ్వర్య రజనీకాంత్ దర్శకురాలిగా సక్సెస్ అవ్వడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తోంది.. కానీ ఒక సినిమా కూడా సరైన సక్సెస్ ను అందివ్వలేక పోతోంది.. ఇక చివరిగా ఐశ్వర్య రజనీకాంత్ లాల్ సలాం అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.. అయితే ఇందులో తన తండ్రి రజనీకాంత్ ను ఒప్పించి మరీ.. ఆయనతో గెస్ట్ అప్పియరెన్స్ ఇప్పించింది.. అయినా సరే ఫలితాన్ని మాత్రం పొందలేకపోయింది.. దీంతో ఈ సినిమా డిజాస్టర్ గా నిలవడం వెనుక అసలు కారణం ఇదే అంటూ చెప్పుకొచ్చింది ఐశ్వర్య.. ఈ చిత్రం మొత్తం మారిపోయిందని.. తన కంట్రోల్లో లేకుండా పోయిందని కూడా తెలిపింది. అంతేకాకుండా చివర్లో సినిమా ఫుటేజ్ మొత్తం పోయిందని… ఉన్న దాంట్లోనే అడ్జస్ట్ చేసి సినిమాను పూర్తి చేశాను అని కూడా చెబుతోంది.. అయితే సినిమా డిజాస్టర్ అయిన తర్వాత ఐశ్వర్య రజనీకాంత్ ఇలా సర్ది చెప్పుకునే మాటలు మాట్లాడుతోంది అంటూ నెటిజెన్లు కూడా కామెంట్లు చేస్తున్నారు.. ఇదిలా ఉండగా మరొకవైపు అనిరుధ్ , ధనుష్ కాంబో గురించి కూడా ఐశ్వర్య చెప్పుకు రావడం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తుంది..

ధనుష్ , అనిరుధ్ పై ఐశ్వర్య కామెంట్..
అనిరుధ్ మాకు రిలేటివ్ అవుతారు.. ముందుగా ధనుష్ అతడి టాలెంట్ ను గుర్తించారు. మామూలుగా అనిరుధ్ బయటకు వెళ్లి ఏదో హైయ్యార్ ఎడ్యుకేషన్ చేయాలని అనుకున్నారు.. కానీ ధనుష్ మాత్రం అనిరుధ్ టాలెంట్ మీద నమ్మకంగా ఉండేవారు. అందుకే త్రీ సినిమాలో అవకాశం ఇచ్చాము అంటూ చెప్పుకొచ్చింది ఐశ్వర్య రజనీకాంత్.. ఇకపోతే సినిమాల్లోకి అనిరుధ్ ను తీసుకువచ్చింది మాత్రం ధనుష్.. ఈరోజు అనిరుద్ ఈ స్థాయిలో ఉన్నాడంటే దానికి కారణం అతనికి కష్టంతో పాటు ధనుష్ హస్తం కూడా ఉంది.. ధనుష్ వల్లే ఇదంతా సాధ్యమైంది అంటూ మాజీ భర్త పై ఈమె చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి..

ఐశ్వర్య పై కామెంట్స్..
మొత్తానికైతే ధనుష్ వల్లే అనిరుధ్ ఇండస్ట్రీకి వచ్చాడని ఈ ముద్దుగుమ్మ తెలిపింది.. ఇది విన్న నెటిజన్స్ మాజీ భర్తని మర్చిపోలేక పోతోంది.. అందుకే అనిరుధ్ పేరుతో ధనుష్ ని తెగ పొగిడేస్తోంది అంటూ కామెంట్లు చేస్తున్నారు.. మరొకవైపు ధనుష్ అభిమానులు మాత్రం ఐశ్వర్య మాటలకు ఉబ్బితబ్బిబవుతున్నారని చెప్పాలి.. అంతేకాదు ఈమె ఎంతో నిజాయితీగా చెప్పింది అంటూ ఆమెను ప్రశంసిస్తున్నారు.. ఇక ధనుష్, అనిరుధ్ ఫ్యాన్స్ అయితే ఈ వీడియోని షేర్ చేస్తూ ఉండడం గమనార్హం.

- Advertisement -

ఐశ్వర్య, ధనుష్ వ్యక్తిగత జీవితం..
2004లో ధనుష్ ,ఐశ్వర్య రజనీకాంత్ ప్రేమించి మరీ వివాహం చేసుకున్నారు.. వీరిద్దరికి ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. అయితే 2022లో ఏమైందో తెలియదు కానీ ఇద్దరం పరస్పర అంగీకారంతోనే విడిపోతున్నామంటూ ప్రకటించారు.. ఇక మళ్ళీ వీరిద్దరూ కలుస్తారంటూ అప్పుడప్పుడు కోలీవుడ్లో రూమర్లు వినిపిస్తూ ఉంటాయి కానీ వీరు మాత్రం ఎవరికి వారు తమ కెరియర్ పై ఫోకస్ చేసిన విషయం తెలిసిందే.

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు