Aishwarya Rajinikanth: ధనుష్ వల్లనే తను ఇండస్ట్రీలోకి వచ్చాడు

తమిళ్ ఫిలిమ్ ఇండస్ట్రీలో ఉన్న సంగీత దర్శకులలో అనిరుధ్ రవిచంద్రన్ ఒక యంగ్ సెన్సేషన్ అని చెప్పొచ్చు. అనిరుధ్ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక నార్మల్ సీన్ ని కూడా తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో అద్భుతంగా ఎలివేట్ చేయడం అనిరుధ్ కు చాలా సులభమైన పని అని చెప్పొచ్చు. పిట్ట కొంచెం కూత గానం అన్నట్లు చూడ్డానికి చాలా చిన్నగా కనిపించిన అనిరుధ్ చాలా పెద్ద పెద్ద వండర్స్ ను క్రియేట్ చేశాడు.

2012లో రిలీజ్ అయిన 3 సినిమాతో సంగీత దర్శకుడుగా ఫిల్మ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు అనిరుధ్. అయితే ఐశ్వర్య రజినీకాంత్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ధనుష్ మరియు శ్రుతిహాసన్ హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా రిలీజ్ కంటే ముందు అన్నది ఒక సాంగ్ ని కంపోజ్ చేశాడు అనిరుధ్. అదే కొలవరి డీ, కొలవరి డీ పాట గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందాడు అనిరుధ్ ఆ పాటతో. ఆ తర్వాత తమిళ్ సినిమాలకి అద్భుతమైన సంగీతాన్ని అందించి తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సాధించుకున్నాడు.

అనిరుద్ ఇప్పటివరకు వర్క్ చేయని స్టార్ యాక్టర్ అంటూ లేరు అనేటట్లు చెప్పొచ్చు. అనిరుధ్ కెరియర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు ఉన్నాయి. ఇకపోతే తెలుగులో రిలీజ్ అయిన అజ్ఞాతవాసి సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి సంగీత దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు. అజ్ఞాతవాసి సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గానే మిగిలింది. ఆ తర్వాత మళ్లీ జెర్సీ అనే సినిమాతో తనను తాను ప్రూవ్ చేసుకొని తన టాలెంట్ ఏంటో చూపించాడు అనిరుధ్.

- Advertisement -

ఇక రీసెంట్ టైమ్స్ లో అనిరుద్ సంగీతం వహించిన మాస్టర్, లియో, విక్రమ్, జైలర్ వంటి సినిమాలు ఎంత పెద్ద హిట్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలానే అట్లీ దర్శకత్వంలో వచ్చిన జవాన్ సినిమా అయితే ఒక రేంజ్ లో హిట్ అయింది. దాదాపు 1000 కోట్ల వరకు జవాన్ సినిమా వసూలు చేసింది. అయితే ప్రస్తుతం అనుదీప్ చేతిలో అద్భుతమైన ప్రాజెక్ట్స్ ఉన్నాయి. కేవలం సంగీత దర్శకుడుగానే కాకుండా సింగర్ గా కూడా చాలా పాటలను పాడాడు అనిరుధ్.

ఇకపోతే అనిరుధ్ చాలా పెద్ద పెద్ద ప్రాజెక్టులకి వర్క్ చేస్తున్నాడు. శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఇండియన్ 2 సినిమాకి అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. అలానే కొరటాల శివ ఎన్టీఆర్ కాంబినేషన్ లో వస్తున్న దేవర సినిమాకి కూడా అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. జ్ఞానవేలు దర్శకత్వంలో రజినీకాంత్ చేస్తున్న సినిమాకి కూడా అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. రజినీకాంత్ చివరగా చేసిన జైలర్ సినిమాకి ఎంత గొప్ప సంగీతాన్ని అందించడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

అయితే రీసెంట్ గా ఐశ్వర్య రజనీకాంత్ ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో అనిరుధ్ ను మీరు పరిచయం చేసారు అని యాంకర్ అడిగినప్పుడు అనిరుధ్ పరిచయం చేసిన కంప్లీట్ క్రెడిట్ ధనుష్ కి చెందుతుంది. ధనుష్ అనుదీప్ ని ఫిల్మ్ ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. పరిచయం మాత్రమే చేశాడు. కానీ అనిరుధ్ తన టాలెంట్ తో పైకి వచ్చాడంటూ చెప్పుకొచ్చారు.

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు