Aha OTT : ప్రైమ్, నెట్ ఫ్లిక్స్ లకు ధీటుగా ప్లానింగ్… ఆహా కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ ల లిస్ట్ ఇదే

Aha OTT : ఇటీవల కాలంలో ఓటీటీ ప్లాట్ఫామ్స్ మధ్య పోటీ పెరిగిన విషయం తెలిసిందే. ముఖ్యంగా అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్ మధ్య నడుస్తోంది ఈ వార్. భారీ బడ్జెట్ కేటాయించి మరీ ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ లను, భారీ అంచనాలు ఉన్న సినిమాలను ఈ రెండు ఓటిటి ప్లాట్ఫామ్స్ పోటాపోటీగా కొనుగోలు చేస్తున్నాయి. త్వరలోనే రాబోతున్న పాన్ ఇండియా సినిమాల రైట్స్ ను చాలావరకు నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. రీసెంట్ గా అమెజాన్ ఓ ఈవెంట్ నిర్వహించి నెట్ ఫ్లిక్స్ దూకుడుకు ఫుల్ స్టాప్ పెట్టింది. ఈవెంట్ లో అమెజాన్ తాము ఈ ఏడాది రిలీజ్ చేయబోయే సిరీస్ లు, సినిమాల లిస్టులను బయట పెట్టింది. మోస్ట్ అవైటింగ్ వెబ్ సిరీస్ లు అన్ని అమెజాన్ లోనే రాబోతున్నాయి. ఇక నేనేం తక్కువ తిన్నాను అంటూ తాజాగా రీజనల్ కంటెంట్ తో ఆకట్టుకుంటున్న ఆహా ఓటీటీ ప్లాట్ఫామ్ కూడా ఈ రేసులో నిలవడానికి రెడీ అవుతుంది.

అమెజాన్, నెట్ ఫ్లిక్స్ లకు దీటుగా నిలిచేలా ఉగాది సందర్భంగా తాము రిలీజ్ చేయబోతున్న కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లకు సంబంధించిన వరుస అప్డేట్స్ ఇచ్చేసింది ఆహా. ఎట్లిచ్చినం అనే క్యాప్షన్ తో ఉగాది పర్వదినాన ఆహా ఓటీటీ కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ ను అనౌన్స్ చేసింది. మరి ఇంతకీ ఆహాలో రాబోతున్న ఆ ఇంట్రెస్టింగ్ సినిమాలు, వెబ్ సిరీస్ ల లిస్ట్ ఏంటి? అనే విషయంలోకి వెళ్తే…

1. ప్రేమలు

మలయాళంలో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన ప్రేమలు మూవీని తెలుగులో కూడా రిలీజ్ చేసిన విషయం తెలిసింది. ఈ మూవీ తెలుగు వెర్షన్ ఏప్రిల్ 12 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కాబోతోంది. నస్లీన్, మమతా బైజు హీరో హీరోయిన్లుగా నటించిన ఈ ప్రేమలు మూవీని తెలుగులో రాజమౌళి తనయుడు కార్తికేయ రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ వసీచింది. ఈ మూవీ మలయాళ వెర్షన్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో రాబోతోంది.

- Advertisement -

2. సిన్ 2

తిరువీర్, బిగ్బాస్ బ్యూటీ దీప్తి సతి ప్రధాన పాత్రలు పోషించిన సిన్ వెబ్ సిరీస్ కు సీజన్ 2 రాబోతోంది. దీనికి సంబంధించిన పోస్టర్ ఆహా వారు తాజాగా రిలీజ్ చేశారు. అందులో తిరువీర్, దీప్తి స్ సెల్ఫీకి ఫోజులివ్వగా, వారి ముఖాలు కనిపించకుండా షేడ్ చేస్తూ చూపించారు. త్వరలోనే అంటూ సిన్ వెబ్ సిరీస్ కు సంబంధించిన పోస్టర్ ను వదిలారు. కానీ రిలీజ్ డేట్ ఇంకా అనౌన్స్ చేయలేదు.

3. త్రీ రోజెస్ 2

పాయల్ రాజ్ పుత్, ఈశా రెబ్బా, పూర్ణ ప్రధాన పాత్రలు పోషించిన వెబ్ సిరీస్ త్రీ రోజెస్. చాలా రోజుల కిందట రిలీజ్ అయిన ఈ సిరీస్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ లభించింది. తాజాగా త్రీ రోజెస్ సీజన్ 2 రాబోతోందనీ ఆహా అనౌన్స్ చేసింది. బోల్డ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సిరీస్ కు డైరెక్టర్ మారుతీ క్రియేటర్ గా వ్యవహరించగా, రవి నంబూరి దర్శకత్వం వహించారు.

4. ఆహాలో రాబోతున్న సినిమాలు ఇవే…

హరివిల్లు పేరుతో అపార్ట్మెంట్ కల్చర్ బ్యాక్గ్రౌండ్ లో ఓ యువ జంట కథను రూపొందిస్తున్నట్టు ఆహా వెల్లడించింది. దీంతో పాటే రాక్షసి, డ్రైవ్, లవ్ డైరీస్ అనే సినిమాలను ఆహా ఓటిటి తాజాగా అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. డ్రైవర్ మూవీ యాక్షన్ థ్రిల్లర్ కాగా, రాక్షసి మూవీ హార్రర్ కథాంశంతో తెరకెక్కుతోంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు