Nitya Shetty: అంజి చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఇప్పుడు చూస్తే షాక్..!

Nitya Shetty.. టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి స్వయం కృషి తో స్టార్ స్టేటస్ అందుకున్న మెగాస్టార్ చిరంజీవి గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఈయన ఎంతోమంది దర్శక నిర్మాతలను, హీరోయిన్స్ ను కూడా సినీ ఇండస్ట్రీకి పరిచయం చేశారు. మరి కొంతమంది చైల్డ్ యాక్టర్ గా చిరంజీవి సినిమాలలో నటించి ఇప్పుడు హీరోలుగా, హీరోయిన్స్ గా కూడా ప్రేక్షకులను బాగా అలరిస్తూ ఉన్నారు. అలా ఇప్పటికే చిరంజీవి సినిమాలలో చైల్డ్ ఆర్టిస్టులుగా నటించి ఇప్పుడు హీరోలుగా చలామణి అవుతున్న వారిలో తేజ సజ్జ కూడా ఒకరు. ఈయనతోపాటు చిరంజీవి సినిమాలో నటించిన మరో చైల్డ్ ఆర్టిస్టు కూడా ఇప్పుడు హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.. పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

అంజి సినిమా చైల్డ్ ఆర్టిస్ట్..
డైరెక్టర్ కోడి రామకృష్ణ , చిరంజీవి కాంబినేషన్లో వచ్చిన అంజి సినిమా అందరికీ సుపరిచితమే.. ఈ సినిమా సోషియో ఫాంటసీ సినిమాగా మంచి పేరు సంపాదించింది. 2004 లో ఈ చిత్రం రిలీజ్ అయింది. ఇందులో హీరోయిన్ గా మహేష్ భార్య నమ్రత నటించగా.. అలాగే రమ్యకృష్ణ కూడా స్పెషల్ సాంగ్ లో కనిపించింది. దాదాపుగా అంజి సినిమా షూటింగ్ మొదలై ఆరు సంవత్సరాల తర్వాత 2004లో ఈ సినిమా విడుదల అయింది. సినిమా కథపరంగా ప్రేక్షకులను నిరాశ పరిచినా.. ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్ విభాగంలో మాత్రం జాతీయ పురస్కారాన్ని కూడా అందుకున్నది. ఇకపోతే అంజి చిత్రంలో చైల్డ్ యాక్టర్ గా చాలామంది నటించారు. అందులో ఒక చైల్డ్ యాక్టర్ నిత్యాశెట్టి..

నిత్యాశెట్టి పాపులారిటీ..
నిత్య శెట్టి చైల్డ్ యాక్టర్ గా ఎన్నో చిత్రాలలో నటించింది. చైల్డ్ యాక్టర్ గా ఉన్న నిత్యాశెట్టిని ఇప్పుడు ఎంగేజ్ లో చూసిన వారందరూ ఆశ్చర్యపోతున్నారు. సోషల్ మీడియాలో తరచూ యాక్టివ్ గా ఉంటూ అందులో భాగంగా తన ఫోటోలను కూడా షేర్ చేసింది.. అయితే నిత్యాశెట్టి ఇటీవలే హీరోయిన్గా మారినా..పెద్దగా అవకాశాలు అయితే రావడంలేదని సమాచారం.. నిత్యాశెట్టి మాత్రం నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకునే ప్రయత్నాలు చేస్తోంది ఈ ముద్దుగుమ్మ.

- Advertisement -

 

ఎంగేజ్ లో నిత్యాశెట్టి.
తాజాగా కొన్ని ఫోటోలు షేర్ చేయగా ఈ ఫోటోలు చూసిన నెటిజన్స్ అయితే ఒక్కసారిగా ఆశ్చర్యపోతున్నారు.. చైల్డ్ యాక్టర్ గా నటించిన నిత్యాశెట్టి ఏంటి? ఇంత అందంగా మారిపోయిందా? అంటూ ఆమె అందాన్ని సైతం పొగిడేస్తున్నారు. నిత్య శెట్టి ‘ఓ పిట్ట కథ’ అనే సినిమాలో నటించింది. ఈ సినిమా ఒక మోస్తారుగా పరవాలేదు అనిపించుకున్నా ఆ తర్వాత అవకాశాలు మాత్రం అందుకోలేకపోయింది. కానీ ఈమె నటనకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. మరి రాబోయే రోజుల్లో ఈమె టాలెంట్ కు తగ్గ అవకాశాలు వచ్చి హీరోయిన్గా ఎదుగుతుందేమో చూడాలి మరి. ప్రస్తుతం నిత్యా శెట్టికి సంబంధించి ఈ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.

 

View this post on Instagram

 

A post shared by Nitya Shetty (@nityashettyoffl)

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు